ఉదయమే ఆందోళన:

ఉదయం లేవగానే చాలామందికి ఆందోళన, గుండెదడ వంటివి కలుగుతుంటాయి. దీని వెనుక కారణం ఏంటో నిపుణులు వివరించారు.
అసలు కారణం CAR:
బాడీలోని కార్టిసాల్ అవేకనింగ్ రెస్పాన్స్ (CAR) దెబ్బతినడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
బాడీని చురుగ్గా ఉంచేందుకు:
బాడీని చురుగ్గా ఉంచేందుకు కార్టిసాల్ పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.
హార్మోన్ అదుపు తప్పుతుంది:
నిద్రలేమి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల ఈ హార్మోన్ అదుపు తప్పుతుందని నిపుణులు అంటున్నారు.
10 నిమిషాలు ఎండలో:
దీని నియంత్రణకు లేవగానే 10 నిమిషాలు ఎండలో గడపాలని నిపుణులు సూచిస్తున్నారు.
వెంటనే కాఫీ వద్దు:
ఉదయం లేవగానే వెంటనే కాఫీ, టీ తాగొద్దని నిపుణులు చెబుతున్నారు.
యోగా చేయండి:
రోజూ యోగా చేయడం వల్ల కార్టిసాల్ హార్మోన్ అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామం తప్పనిసరి:
యోగాతో పాటు రోజూ వ్యాయామం చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నిద్రలేమి, ఒత్తిడి దూరం:
నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలను అదుపులో ఉంచుకుంటే కార్టిసాల్ సమతుల్యంగా ఉంటుంది.
చిన్న అలవాట్లతో ఉపశమనం:
ఎండలో గడపడం, కాఫీ, టీ ఆలస్యం చేయడం, యోగా, వ్యాయామం.. ఈ చిన్న అలవాట్లతో ఉదయపు ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు.