ఉదయాన్నే చల్లని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మెదడు చురుగ్గా మారి, నిద్రమత్తు వదిలిపోతుంది. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
మెరుగైన రక్తప్రసరణ:
ఉదయం పూట స్నానం చేయడం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ తక్షణమే మెరుగవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది.
ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బెస్ట్:
రాత్రి నిద్రించే సమయంలో చర్మంపై అదనపు నూనెలు పేరుకుపోతాయి. ఉదయం స్నానంతో ఇవి తొలగిపోయి చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి.
క్రియేటివిటీ పెరుగుతుంది:
ఉదయం షవర్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మెదడులో ఆలోచనా శక్తి, సృజనాత్మకత పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
కాలుష్యం నుంచి విముక్తి:
రోజంతా బయట తిరగడం వల్ల శరీరానికి అంటుకునే ధూళి, ప్రమాదకర బ్యాక్టీరియా, చెమటను రాత్రి పూట చేసే స్నానం పూర్తిగా తొలగిస్తుంది.
చర్మ సమస్యలకు చెక్:
చర్మ నిపుణుల ప్రకారం.. అలర్జీలు లేదా డ్రై స్కిన్ ఉన్నవారు రాత్రి వేళ స్నానం చేయడం వల్ల చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ప్రొటెక్ట్ అవుతుంది.
కండరాల రిలాక్సేషన్:
రాత్రి వేళ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రోజంతా అలసిపోయిన కండరాల ఒత్తిడి తగ్గి, శరీరం తేలికగా మారుతుంది.
నిద్రలేమికి గుడ్ బై:
రాత్రి స్నానం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి, మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇది నిద్రలేమి సమస్యను దూరం చేసి, త్వరగా గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది.
మీ బెడ్ రూమ్ పరిశుభ్రత:
రాత్రి స్నానం చేసి పడుకోవడం వల్ల శరీరానికి ఉన్న మురికి మీ పరుపు, దుప్పట్లకు అంటకుండా ఉంటుంది. ఇది బెడ్ రూమ్ హైజీన్‌ను పెంచుతుంది.
ఫైనల్ వర్డిక్ట్ - ఏది బెటర్?:
మీరు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లేవారైతే ఉదయం స్నానం.. అదే పొల్యూషన్‌లో డ్యూటీ చేసేవారైతే లేదా నిద్ర సమస్యలు ఉంటే రాత్రి స్నానం బెస్ట్. వీలైతే రెండు పూటలా స్నానం చేయడం మరీ మంచిది.