IPL 2027 కోసం సంచలన ట్రేడ్ పూర్తయింది. ముంబైని వీడి పంజాబ్‌కు వెళ్తున్న హార్దిక్. ఫస్ట్ రియాక్షన్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
IPL అధికారిక ప్రకటన
హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు, అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు. ఇద్దరి మార్పిడితో IPL 2027 ట్రేడ్‌కు బుధవారం అధికారికంగా ఆమోదం లభించింది.
ముందుగా అర్ష్‌దీప్ మెసేజ్
ట్రేడ్ వార్తలపై ఇద్దరూ మౌనంగా ఉన్నారు. తొలుత అర్ష్‌దీప్ సింగ్ MI ట్విటర్ హ్యాండిల్ నుంచి వీడియో మెసేజ్ ద్వారా స్పందించాడు.
హార్దిక్ ఫస్ట్ రియాక్షన్
ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా మౌనం వీడాడు. పంజాబ్ అభిమానుల కోసం సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. అదే అతని ఫస్ట్ రియాక్షన్.
"మై కెప్టెన్. శ్రేయస్
"మై కెప్టెన్ శ్రేయస్. మై కోచ్ రికీ పాంటింగ్. మై టీమ్ ఆల్ ఆఫ్ పంజాబ్. నేను మీ వెనుకే నిలబడి ఉన్నాను" అని హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు.
శ్రేయసే కెప్టెన్ అని క్లారిటీ
MIలో అసంతృప్తితో హార్దిక్ కెప్టెన్సీ కోసమే వెళ్తున్నాడనే చర్చ జరిగింది. పంజాబ్‌లో హార్దికా? శ్రేయసా? అనే డిబేట్‌కు హార్దిక్ పోస్ట్‌తో తెరపడింది.
2025 ఫైనల్ హీరో శ్రేయస్
శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోనే పంజాబ్ కింగ్స్ IPL 2025 ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో RCB చేతిలో ఓడినా, శ్రేయస్ కెప్టెన్సీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
పాంటింగ్‌తో జోడీ
తన కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పేర్కొంటూ హార్దిక్ పూర్తి మద్దతు ప్రకటించాడు. శ్రేయస్-పాంటింగ్ కాంబోలో ఆడేందుకు సిద్ధమని సంకేతం ఇచ్చాడు.
ఏడాదిగా దూరం
హార్దిక్ IPL 2026 తర్వాత ఏ క్రికెట్ ఆడలేదు. డిసెంబర్‌లో శ్రీలంక T20లు, జనవరిలో జింబాబ్వే సిరీస్‌కు కూడా ఫిట్‌నెస్ దక్కదని రిపోర్టులు చెబుతున్నాయి.
IPL 2027లో కంబ్యాక్
జర్నలిస్ట్ అభిషేక్ త్రిపాఠి రిపోర్ట్ ప్రకారం, IPL 2027 ముందే హార్దిక్ ఫిట్ అవుతాడు. అంటే ఏడాది గ్యాప్ తర్వాత నేరుగా పంజాబ్ తరఫున బరిలోకి దిగుతాడు. రిస్క్ తో కూడిన ట్రేడ్ ఇదే!