Niharika Konidela: యాంకర్ నుంచి నేషనల్ అవార్డు వరకు.. నిహారిక కొణిదెల సినీ ప్రయాణం!
యాంకర్‌గా కెరీర్ మొదలు
సినిమాల్లోకి రాకముందు ‘ఢీ జూనియర్స్’ షోతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ముద్దపప్పు ఆవకాయ్ (షార్ట్ ఫిల్మ్)
యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘుచిత్రంతో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు.
ఒక మనసు (2016)
నాగ శౌర్య సరసన నటించి, ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
నాన్న కూచి (వెబ్ సిరీస్)
యూట్యూబ్ వేదికగా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో నటనతో పాటు నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు.
హ్యాపీ వెడ్డింగ్ (2018)
సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటించారు.
'ఒరు నల్లనాళ్ పాాతు సొల్ఱేన్' (2018)
విజయ్ సేతుపతి చిత్రంతో కోలీవుడ్‌ (తమిళం)లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించారు.
సూర్యకాంతం (2019)
రాహుల్ విజయ్ తో కలిసి టైటిల్ రోల్‌లో వైవిధ్యమైన పాత్రలో కనిపించారు.
సైరా నరసింహ రెడ్డి (2019)
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్రలో మెరిశారు.
కమిటీ కుర్రోళ్లు (2024 - నేషనల్ అవర్డ్ విన్నర్)
నిర్మాతగా తొలి ప్రయత్నంలోనే ఏకంగా జాతీయ పురస్కారాన్ని (National Award) సొంతం చేసుకున్నారు.
మద్రాస్‌కారన్ & రాకాస (2025-2026)
వరుస చిత్రాలతో నటిగా, నిర్మాతగా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.