నికీషా పటేల్ 1990లో యూకేలో సెటిలైన ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించింది. టీనేజ్‌లోనే మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మిస్ ఇండియా యూకే విజేతగా నిలిచింది.
15 ఏళ్లకే బీబీసీ షోస్:
చిన్నప్పటి నుంచే యాక్టింగ్, గ్లామర్ ఫీల్డ్‌పై ఆసక్తి ఉండటంతో కేవలం 15 ఏళ్ల వయసులోనే బీబీసీకి చెందిన పలు షోలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.
పవన్ కల్యాణ్‌తో గ్రాండ్ డెబ్యూ:
బాలీవుడ్‌లో ఓ సినిమా ఆగిపోయిన తర్వాత, టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సరసన కొమరం పులి(2010) సినిమాలో హీరోయిన్‌గా మెగా ఛాన్స్ దక్కించుకుంది.
డిజాస్టర్ అయిన పులి :
భారీ అంచనాల మధ్య విడుదలైన కొమరం పులి సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో నికీషా ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి.
గ్లామర్ పరంగా మంచి మార్కులు:
తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, కొమరం పులిలో పోలీస్ ఆఫీసర్ పవన్ పక్కన తన అందం, యాక్టింగ్, గ్లామర్ లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులను నికీషా బాగానే మెప్పించింది.
వరుస ఫ్లాపులు - కెరీర్ క్లోజ్:
ఆ తర్వాత తెలుగులో ఓం 3డి, అరకు రోడ్డులో, గుంటూరోడు, గుంటూరు టాకీస్ 2.0 వంటి సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడ భాషల్లో ప్రయత్నించినా ఏవీ వర్కవుట్ కాకపోవడంతో 2019 తర్వాత యాక్టింగ్‌కు పూర్తిగా దూరమైంది.
లండన్‌లో సెటిల్‌మెంట్:
సినిమా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్‌కు గుడ్ బై చెప్పేసి లండన్ వెళ్ళిపోయింది. ప్రస్తుతం 34 ఏళ్ల నికీషా పటేల్ తన ఫ్యామిలీతో కలిసి యూకేలోనే నివసిస్తోంది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్:
సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ అండ్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను, అభిమానులను అలరిస్తూనే ఉంది.
త్వరలోనే లండన్ బాబుతో పెళ్లి:
ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న వేళ నికీషా కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. బ్రిటన్‌లో ఉండే తన మనసుకు నచ్చిన వాడిని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
మెగాస్టార్ కామెంట్‌తో వివాదం:
ట్విట్టర్ చాట్‌లో టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ.. మహేష్ బాబు ఫెయిర్ అండ్ లవ్లీ అని, ప్రభాస్ మంచి ఫ్రెండ్ అని చెప్పింది. అయితే చిరంజీవి గురించి అడిగితే.. ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారు, ఏ మెగాస్టార్? అని రివర్స్ కౌంటర్ వేయడంతో మెగా ఫ్యాన్స్ ఆమెపై తీవ్రంగా మండిపడ్డారు.