Nutmeg Water : రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. ఈ అద్భుతమైన ప్రయోజనాలు మీ సొంతం
పోషకాల గని:
జాజికాయలో శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి.
సహజసిద్ధమైన యాంటీ బయోటిక్:
ఇందులో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
జీర్ణ సమస్యలకు చెక్:
జాజికాయ నీరు కడుపు ఇన్ఫెక్షన్లను దూరం చేసి, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం:
నేటి కాలంలో చాలామందిని వేధించే మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఈ నీరు ఉపశమనం కలిగిస్తుంది.
నొప్పుల తీవ్రత తగ్గింపు:
జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్, కండరాల నొప్పుల తీవ్రత సమర్థవంతంగా తగ్గుతుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది:
ఈ నీటిలో ఉండే ప్రత్యేక గుణాలు శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి.
రోగనిరోధక శక్తి పెంపు:
ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి హానికరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
ఒత్తిడి, ఆందోళన దూరం:
జాజికాయలో ఉండే ట్రిప్టోఫాన్ వంటి సహజ సమ్మేళనాలు మెదడులోని నరాలను శాంతపరిచి, మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి.
హాయిగా నిద్ర:
రాత్రి వేళల్లో నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యతో బాధపడేవారు ఈ నీటిని తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడి, హాయిగా నిద్రపోవచ్చు.
మెరిసే చర్మ సౌందర్యం:
ఈ నీరు రక్తాన్ని శుద్ధి చేసి ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను నివారించడమే కాకుండా, వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని యవ్వనంగా, కాంతివంతంగా మారుస్తుంది.