గతేడాది వచ్చిన ఏస్ 6 సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న వన్ ప్లస్ ఏస్ 7 సిరీస్ అక్టోబర్ 29న చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది.
శక్తివంతమైన ప్రాసెసర్ :
ఈ లైనప్‌లోని ఫ్లాగ్షిప్ మోడల్ 'వన్ ప్లస్ ఏస్ 7 ప్రో' స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5) ప్రాసెసర్‌తో రానుంది.
విండ్ చేజర్ గేమ్ కెర్నల్ :
హెవీ గేమింగ్ , ప్రాసెసింగ్ సమయాల్లో అత్యుత్తమ పనితీరు అందించడానికి కంపెనీ తన సొంత “విండ్ చేజర్ గేమ్ కెర్నల్” ను చిప్సెట్ నిర్మాణంలో పొందుపరిచింది.
డ్యూయల్-ఎయిర్‌ఫ్లో కూలింగ్ :
హెవీ మల్టీ టాస్కింగ్ సమయాల్లో ఫోన్ వేడెక్కకుండా ఉంచేందుకు డ్యూయల్-ఎయిర్‌ఫ్లో ఛానల్ డిజైన్‌తో కూడిన అధునాతన కూలింగ్ వ్యవస్థను అందించారు.
టవర్ ఫిన్ హీట్ సింక్ :
డెస్క్‌టాప్ పీసీ గ్రాఫిక్స్ కార్డుల ఆధారంగా రూపొందించిన ప్రత్యేక టవర్ ఫిన్ హీట్ సింక్ వేడిని వేగంగా బయటకు పంపుతుంది. నిరంతరం ఉష్ణోగ్రతను పర్యవేక్షించేందుకు థర్మల్ సెన్సార్లు కూడా ఉన్నాయి.
ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లు :
వన్ ప్లస్ ఏస్ 7 'రేడియంట్ వైట్' రంగులో, ఏస్ 7 ప్రో 'మిడ్నైట్ బ్లాక్' రంగులో ప్రీమియం లుక్‌తో రానున్నాయి.
ఫైబర్‌గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్ :
వేలిముద్రలు, గీతలు పడకుండా ఉండేందుకు ఫోన్ వెనుక భాగాన్ని ఫైబర్‌గ్లాస్ మ్యాట్ ఫినిషింగ్ , ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌తో రూపొందించారు.
'స్టార్మ్ ఐలాండ్' కెమెరా డిజైన్ :
వెనుక కెమెరా అమరిక కోసం మెటల్ క్యూబ్ రూపంలో "స్టార్మ్ ఐలాండ్" డిజైన్‌ను ఇచ్చారు. కెమెరా మాడ్యూల్లోనే ఓవల్ ఆకారపు ఎయిర్ ఇన్‌టేక్ , కూలింగ్ ఫ్యాన్‌ను అమర్చారు.
డైనమిక్ క్రెసెంట్ లైటింగ్ :
ప్రధాన కెమెరా కింద ప్రత్యేకంగా అమర్చిన ఈ లైటింగ్ గేమింగ్ సమయాల్లో , నోటిఫికేషన్లు వచ్చినప్పుడు డిఫరెంట్ లైటింగ్ ఎఫెక్ట్స్‌తో కొత్త అనుభూతిని ఇస్తుంది.
అల్ట్రా థిన్ ఫ్లాట్ డిస్ప్లే :
ముందు భాగంలో అత్యంత సన్నని అంచులు కలిగిన సమతుల్య ఫ్లాట్ డిస్ప్లేను అందించారు. సెల్ఫీ కెమెరా కోసం చిన్న పంచ్-హోల్ కటౌట్ ఇవ్వడంతో వ్యూయింగ్ ఏరియా పెరిగింది.