డిస్కౌంట్‌ పేరుతో మాయకు చెక్‌

2027 జనవరి అమల్లోకి రానున్న కొత్త వినియోగదారుల రక్షణ (ఇ-కామర్స్) (సవరణ) నిబంధనలు, 2026 ద్వారా సేల్‌కు ముందు ధర పెంచి భారీ డిస్కౌంట్‌ ఇచ్చినట్లు చూపించే విధానాలకు అడ్డుకట్ట పడనుంది.
30 రోజుల ప్రైజ్ హిస్టరీ
ధర తగ్గించినప్పుడు గత 30 రోజుల్లో ఆ ప్రొడక్ట్ ధర ఎలా ఉందో వినియోగదారులకు చూపించాల్సి ఉంటుంది.
డార్క్‌ ప్యాటర్న్స్‌పై చర్యలు
వినియోగదారులను తప్పుదోవ పట్టించే డిజిటల్‌ ట్రిక్కులపై నిబంధనలు మరింత కఠినం కానున్నాయి.
వ్యక్తిగత డేటాకు రక్షణ
వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించకూడదు.
అదనపు ఫీజులపై పరిమితి
అవసరం లేని సేవలను బలవంతంగా జోడించి అదనపు రుసుములు వసూలు చేయడానికి వీలుండదు.
రిటర్న్‌, రీఫండ్‌ వివరాలు
వస్తువు రిటర్న్‌, రీఫండ్‌ నిబంధనలను కొనుగోలు చేసే ముందే స్పష్టంగా తెలియజేయాలి.
వారంటీ, గడువు సమాచారం
మీరు కొనుగోలు చేసే సదరు ప్రొడక్ట్ వారంటీ, గడువు తేదీ వంటి ముఖ్యమైన వివరాలను ప్లాట్‌ఫామ్‌లు స్పష్టంగా చూపించాలి.
ప్రొడక్ట్ తయారీ దేశం
దిగుమతి చేసుకున్న వస్తువులు ఏ దేశానికి చెందినవో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.
సెర్చ్‌ ర్యాంకింగ్‌లో పారదర్శకత
ఉత్పత్తులు సెర్చ్‌లో ఏ క్రమంలో కనిపిస్తున్నాయో నిర్ణయించే విధానాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
NCHతో అనుసంధానం
ఈ-కామర్స్‌ సంస్థలు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ (NCH)తో అనుసంధానం కావాలి. దీంతో ఫిర్యాదుల పరిష్కారం మరింత సులభం కానుంది.