పాన్ కార్డులో పాత ఫొటో ఉందా? ఇంటి నుంచే ఇలా మార్చుకోండి
అధికారిక పోర్టల్‌నే ఉపయోగించండి
PANలో మార్పుల కోసం Protean లేదా UTIITSL అధికారిక పోర్టల్‌ను మాత్రమే ఉపయోగించాలి.
క‌రెక్ష‌న్ సేవను ఎంచుకోండి
ఇప్పటికే PAN ఉన్నవారు కొత్త కార్డు కోసం కాకుండా పాన్ క‌రెక్ష‌న్ సేవ‌ను సెల‌క్ట్ చేసుకోవాలి.
వివరాలు నమోదు చేయండి
PAN నంబర్, పేరు, పుట్టిన తేదీ వంటి అడిగిన వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.
కొత్త ఫొటో సిద్ధం చేసుకోండి
ఇటీవల తీసిన స్పష్టమైన ఫొటోను సిద్ధం చేసుకుని, పోర్టల్ సూచించిన పరిమాణంలో అప్‌లోడ్ చేయాలి.
అవసరమైన పత్రాలు సమర్పించండి
గుర్తింపు, చిరునామా లేదా ఇతర ఆధారాలు అవసరమైతే పోర్టల్ సూచనల ప్రకారం సమర్పించాలి.
e-KYC సదుపాయం ఉపయోగించుకోవచ్చు
అందుబాటులో ఉంటే ఆధార్‌ ఆధారిత ఈ-కేవైసీ, ఈ-సైన్ ద్వారా ప్రక్రియను ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు.
ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించండి
దరఖాస్తు సమయంలో అధికారిక పోర్టల్‌లో చూపించే ప్రస్తుత సవరణ రుసుమును చెల్లించాలి.
అప్లికేషన్ నంబర్ సేవ్ చేసుకోండి
దరఖాస్తు పూర్తయ్యాక వచ్చే అక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబ‌ర్‌ను భ‌విష్య‌త్తు అవ‌సరాల కోసం భద్రంగా ఉంచుకోవాలి.
పత్రాలు పంపాల్సి రావచ్చు
ఎంచుకున్న వెరిఫికేషన్ విధానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో సంతకం చేసిన పత్రాలను పంపాల్సి రావచ్చు.