Papaya : బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, ఫైబర్, పపైన్ ఎంజైమ్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు, బరువు తగ్గడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, ఎంతటి పోషకాలు ఉన్న ఆహారమైనా అందరికీ సరిపడదు. కొన్ని ప్రత్యేక అనారోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తింటే తీవ్రమైన దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.