పోషకాల గని

పల్లీలలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
బరువు నియంత్రణ
ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి, అతిగా తినకుండా బరువును అదుపు చేస్తాయి.
గుండె ఆరోగ్యం
రోజూ పరిమితంగా పల్లీలు తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.
తక్షణ శక్తి
పల్లీలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
జీవక్రియల వేగం
శరీరంలో మెటబాలిజం రేటును వేగవంతం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
హై బీపీ ముప్పు
ఉప్పు వేసి వేయించిన పల్లీలలో సోడియం పెరిగి, రక్తపోటును మరింత పెంచుతుంది.
యూరిక్ యాసిడ్
అధిక ప్రోటీన్ల వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి, కీళ్ల నొప్పులు తీవ్రమవుతాయి.
ఎలర్జీ సమస్యలు
ఎలర్జీ ఉన్నవారు పల్లీలు తింటే చర్మంపై దురద, వాపు, నొప్పులు వస్తాయి.
కాలేయ వ్యాధులు
లివర్ సమస్యలు ఉన్నవారు పల్లీలను తింటే జీర్ణవ్యవస్థపై భారం పడుతుంది.
గ్యాస్, అజీర్తి
ఇవి అతిగా తింటే జీర్ణక్రియ మందగించి గ్యాస్, అజీర్తి వంటివి వస్తాయి.