ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేని వారు ప్రతి నెలా కొంత మొత్తాన్ని జమ చేస్తూ పొదుపు పెంచుకోవచ్చు. ఇందుకు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం ఉపయోగపడుతుంది.
నెలకు రూ.5,000తో పెట్టుబడి ప్రారంభం
ఈ పథకంలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున డిపాజిట్ చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు నిధిని సిద్ధం చేసుకోవచ్చు.
ఐదేళ్లపాటు పొదుపు చేయాలి
పోస్టాఫీస్ RD పథకం సాధారణంగా ఐదేళ్ల కాలపరిమితితో ఉంటుంది. నెలకు రూ.5,000 చొప్పున ఐదేళ్లు జమ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలు అవుతుంది.
వడ్డీతో కలిపి ఎంత వస్తుంది?
ఏడాదికి 6.7 శాతం వడ్డీ రేటును ఉదాహరణగా తీసుకుంటే, ఐదేళ్లలో అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.3.56 లక్షలు పొందవచ్చు. అయితే వర్తించే వడ్డీ రేటును బట్టి తుది మొత్తం మారుతుంది.
దీర్ఘకాలం పొదుపు చేస్తే మరింత ప్రయోజనం
ఐదేళ్ల మెచ్యూరిటీ తర్వాత RD ఖాతాను నిబంధనల ప్రకారం పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం పొదుపు కొనసాగిస్తే పెట్టుబడి మొత్తం పెరగడంతో పాటు వడ్డీ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది.
పదేళ్లలో రూ.6 లక్షల పెట్టుబడి
నెలకు రూ.5,000 చొప్పున పదేళ్లపాటు పొదుపు చేస్తే మీ జేబు నుంచి పెట్టే మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో కలిపి గణనీయమైన నిధిని సమకూర్చుకోవచ్చు.
రూ.8.5 లక్షలకు పైగా పొందే అవకాశం
ఏడాదికి 6.7 శాతం వడ్డీని పరిగణనలోకి తీసుకుంటే, నెలవారీ రూ.5,000 డిపాజిట్లతో పదేళ్లలో సుమారు రూ.8.5 లక్షలకు పైగా నిధి ఏర్పడవచ్చు.
ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం
పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అందువల్ల మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా క్రమబద్ధమైన పొదుపు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతంది.
9) పిల్లల భవిష్యత్తుకు ఉపయోగకరం
పిల్లల చదువులు, ఉన్నత విద్య, వివాహ ఖర్చులు వంటి భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.
పెట్టుబడికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి
RD ఖాతా ప్రారంభించే ముందు ప్రస్తుత వడ్డీ రేటు, మెచ్యూరిటీ నిబంధనలు, పొడిగింపు విధానం గురించి పోస్టాఫీస్‌లో తెలుసుకోవాలి.