బిర్యానీ ఆకులకు ఉండే ఘాటైన సువాసన పురుగులకు అస్సలు పడదు. బియ్యం డబ్బాలో అక్కడక్కడా కొన్ని బిర్యానీ ఆకులను వేస్తే పురుగులు పారబోతాయి.
ఎండిన వేపాకుల రక్షణ:
పూర్వ కాలం నుంచి ధాన్యాలు పాడవకుండా ఉండటానికి వేపాకులను వాడేవారు. బాగా ఎండిన వేపాకులను నేరుగా బియ్యం డబ్బాలో వేసి ఉంచితే పురుగులు చేరవు.
లవంగాల ఘాటు:
లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, వాటి ఘాటైన వాసన పురుగులను నివారించడంలో, కొత్తగా పురుగులు రాకుండా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
వెల్లుల్లి రెబ్బల ట్రిక్:
పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రెబ్బలను బియ్యం డబ్బాలో వేసి ఉంచడం వల్ల, ఆ వెల్లుల్లి ఘాటుకు పురుగులు డబ్బా దరిచేరడానికి కూడా భయపడతాయి.
పసుపుతో క్రిమినాశక చికిత్స:
బియ్యం నిల్వ చేసేటప్పుడే కొద్దిగా పసుపు పొడిని బియ్యానికి పట్టించి నిల్వ చేయవచ్చు. పసుపులో ఉండే క్రిమినాశక గుణాలు పురుగులను దరిచేరనివ్వవు.
కల్లు ఉప్పుతో నివారణ:
పసుపుతో పాటు కొద్దిగా కల్లు ఉప్పును కూడా బియ్యంలో కలిపి ఉంచడం వల్ల తేమ చేరకుండా ఉంటుంది. పురుగులు పట్టకుండా బియ్యం సురక్షితంగా ఉంటాయి.
గాలి చొరబడని డబ్బాలు:
బియ్యాన్ని ఎల్లప్పుడూ గాలి చొరబడని గట్టి డబ్బాలలో మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. దీనివల్ల వాతావరణంలోని తేమ బియ్యానికి తగలకుండా ఉంటుంది.
పొడి ప్రదేశాలలో నిల్వ:
బియ్యం డబ్బాను ఎల్లప్పుడూ తేమ లేని, పొడి ప్రదేశాలలో మాత్రమే ఉంచాలి. తడి చేతులు లేదా తడి గరిటెలను బియ్యం డబ్బాలో అస్సలు పెట్టకూడదు.
కెమికల్స్ వద్దు.. ఆరోగ్యం ముద్దు:
మార్కెట్లో దొరికే రసాయన మాత్రలను బియ్యంలో వేయడం వల్ల అవి బియ్యంలో కలిసిపోయి ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ప్రమాదం ఉంది.
సహజమైన మార్పిడి:
బియ్యంలో వేసిన వెల్లుల్లి రెబ్బలు లేదా వేపాకులు పూర్తిగా ఎండిపోయినప్పుడు.. వాటి స్థానంలో కొత్త వాటిని మారుస్తూ ఉంటే బియ్యం ఏడాది పొడవునా తాజాగా ఉంటాయి.