కౌచర్ వీక్ ఫినాలే

ఇండియా కౌచర్ వీక్ 2026 గ్రాండ్ ఫినాలేలో శోభిత ధూళిపాళ షో స్టాపర్‌గా సంచలనం సృష్టించింది.
'దేవి' కలెక్షన్
రాహుల్ మిశ్రా రూపొందించిన 'దేవి: ది ఎటర్నల్ మ్యూజ్' కలెక్షన్ కోసం ఆమె ర్యాంప్‌పై మెరిసింది.
ఆలయ కళాకృతి
భారతీయ సాంప్రదాయ ఆలయ కళ, అజంతా గుహల డిజైన్ల ప్రేరణతో ఈ దుస్తులను తీర్చిదిద్దారు.
శోభిత జంప్‌సూట్
క్రిస్టల్ బెల్ట్, ప్రత్యేక ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఉన్న న్యూడ్ షేడ్ జంప్‌సూట్‌లో శోభిత మెరిసిపోయింది.
లైవ్ శృంగార వేడుక
ర్యాంప్‌పైనే మోడల్స్ శోభితను అలంకరించే 'లైవ్ శృంగార' ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఆప్సరస అవతారం
రెండవసారి ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు శోభిత అచ్చం అప్సరసలా దేవతా రూపంలో కనిపించింది.
షాంపైన్ ఓవర్-స్కర్ట్
పూల ఆకృతులు, సీక్విన్ల తో కూడిన షాంపైన్ టోన్ స్కర్ట్ ఆమె రూపానికి గ్రాండ్ లుక్ ఇచ్చింది.
రాయల్ జ్యువెలరీ
డైమండ్ చోకర్, ప్రత్యేక మ్యాగ్నోలియా హెయిర్ యాక్సెసరీతో శోభిత రాయల్ లుక్‌లో అదరగొట్టింది.
మెరిసే మేకప్
వింగ్డ్ స్మోకీ ఐలైనర్, న్యూడ్-బ్రౌన్ లిప్‌స్టిక్‌తో శోభిత మేకప్ డ్రెస్‌కు తగినట్లుగా నిలిచింది.
ఫ్యాషన్ మాయాజాలం
భారతీయ మూలాలు, రాహుల్ మిశ్రా కౌచర్ మేళవింపుగా ఈ ఫ్యాషన్ షో అద్భుతంగా సాగింది.