ఫొటోలోని ఆధారాలు:

మనం పోస్ట్ చేసే ఫొటోలలో వెనుక కనిపించే సైన్ బోర్డులు, షాపుల పేర్లు, భవనాలు, మైలురాళ్లు లేదా కారు నంబర్ ప్లేట్లు మన లొకేషన్‌ను సులభంగా గుర్తిస్తాయి.
కెమెరా మెటాడేటా :
ఫొటో తీసినప్పుడు దాని వెనుక ఉండే డిజిటల్ డేటాలో లొకేషన్ వివరాలు దాగి ఉంటాయి. సోషల్ యాప్స్ వీటిని తొలగించినా, కొన్ని ఫొటోల ద్వారా డేటా బహిర్గతమయ్యే ప్రమాదం ఉంది.
AI ట్రాకింగ్ పవర్:
గతంలో ఫొటో ఆధారంగా ప్రదేశాన్ని గుర్తించడానికి సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోలోని చిన్న ఆధారంతో లొకేషన్‌ను కచ్చితంగా అంచనా వేస్తోంది.
వరుస పోస్టుల పరిశీలన:
సైబర్ నేరగాళ్లు లేదా అపరిచితులు మీరు వేర్వేరు సమయాల్లో పెట్టే ఫొటోలను సమగ్రంగా పరిశీలించి మీ రోజువారీ దినచర్యను సులభంగా ట్రాక్ చేస్తారు.
కదలికలపై నిఘా:
మీరు తరచుగా వెళ్లే రెస్టారెంట్లు, ఆఫీస్ లేదా జిమ్ ఫొటోలను పోస్ట్ చేయడం వల్ల మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటారనే పూర్తి వివరాలు ఇతరులకు తెలిసిపోతాయి.
లైవ్ లొకేషన్ షేరింగ్ ప్రమాదం:
ఇంటి నుంచి బయలుదేరగానే లేదా ఒక ప్రదేశానికి చేరుకోగానే లైవ్ లొకేషన్ షేర్ చేయడం వల్ల మీ ఇల్లు ఖాళీగా ఉందనే సమాచారం దొంగలకు చేరుతుంది.
గుర్తింపు గుర్తులను దాచండి:
ఇంటి అడ్రస్ బోర్డులు, వీధి పేర్లు లేదా వాహనాల నంబర్ ప్లేట్లు స్పష్టంగా కనిపించే ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు.
ప్రైవేట్ ప్రొఫైల్ వాడకం:
మీ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్‌గా ఉంచే బదులు ప్రైవేట్‌గా మార్చుకోవడం ద్వారా అపరిచితులు మీ ఫొటోలను చూడకుండా నిరోధించవచ్చు.
ట్రావెల్ పోస్టులు లేట్‌గా పెట్టండి:
మీరు ట్రిప్‌లో ఉన్నప్పుడు రియల్ టైమ్‌లో కాకుండా, ఆ ప్రయాణం పూర్తయి ఇంటికి తిరిగొచ్చిన తర్వాతే ఫొటోలు అప్‌లోడ్ చేయడం సురక్షితం.
జాగ్రత్తే శ్రీరామరక్ష:
సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్ల కంటే వ్యక్తిగత భద్రతే ముఖ్యం. ఫొటో అప్‌లోడ్ చేసే ముందు అందులో ఎలాంటి సున్నితమైన సమాచారం లేకుండా చూసుకోవడం శ్రేయస్కరం.