రైళ్లలో లౌడ్ స్పీకర్‌తో పాటలు వినడం, వీడియోలు చూడటం వంటి చర్యలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ రైల్వే స్పష్టం చేసింది.
రైల్వే స్టేషన్లలోనూ వర్తించే నిబంధనలు
కేవలం రైళ్లలోనే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ ఫోన్లను స్పీకర్ మోడ్‌లో ఉపయోగిస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగించే వారిపై నిఘా ఉంచనున్నారు.
రూ. 1,000 వరకు జరిమానా విధింపు
నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులకు రూ. 1,000 వరకు జరిమానా విధించడంతో పాటు రైలు లేదా రైల్వే ప్రాంగణం నుంచి బయటకు పంపించే అవకాశం ఉంటుంది.
పదే పదే తప్పు చేస్తే జైలు శిక్ష
ఇదే తప్పును పదేపదే పునరావృతం చేస్తే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5,000 వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.
జన్ విశ్వాస్ చట్టం కింద చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలను నియంత్రించేందుకు 'జన్ విశ్వాస్ చట్టం' కింద సవరించిన రైల్వే చట్టంలోని సెక్షన్ 142ను అమలు చేస్తున్నారు.
ప్రజా ఉపద్రవంగా పరిగణన
భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 270 ప్రకారం ప్రజలకు ఇబ్బంది లేదా అసౌకర్యం కలిగించే చర్యలను పబ్లిక్ న్యూసెన్స్‌గా పరిగణించి శిక్షించనున్నారు.
మెట్రో రైళ్లలోనూ అమలుకు అవకాశం
ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగించే ప్రవర్తనను అరికట్టేందుకు ఇతర రైల్వే జోన్లు, మెట్రో వ్యవస్థలు కూడా ఈ నిబంధనలను ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
విస్తృతమవుతున్న మొబైల్ ఇంటర్నెట్ వాడకం
ప్రస్తుతం అందరి చేతుల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ ఆన్ చేసి వీడియోలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని రైల్వే పేర్కొంది.
అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు
ఈ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు ప్రాంతీయ భాషలు, హిందీ, ఇంగ్లిష్‌లో మైకుల ద్వారా ప్రత్యేక ప్రకటనలు చేయనున్నారు.
టికెట్ తనిఖీ సిబ్బందికి అధికారాలు
ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై టీటీఈలు (TTE), కమర్షియల్ డివిజన్ సీనియర్ అధికారులు నేరుగా జరిమానాలు వసూలు చేసే అధికారం కలిగి ఉంటారు.