సైలెన్స్ అనౌన్ కాల్స్ :
మీ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని అపరిచితుల నుంచి వచ్చే నంబర్లను ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా గుర్తించి సైలెంట్ చేస్తుంది. దీనివల్ల అవాంఛిత మోసపూరిత కాల్స్ నుంచి రక్షణ పొందవచ్చు.
కాంటెక్స్ట్ కార్డ్స్ :
కొత్త నంబర్ల నుంచి కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చినప్పుడు, ఆ అకౌంట్ ఎప్పుడు క్రియేట్ అయింది? మీరేమైనా కామన్ గ్రూప్‌లో ఉన్నారా? వంటి కీలక వివరాలను ఈ ఫీచర్ ముందే తెలియజేస్తుంది.
స్క్రీన్ షేర్ వార్నింగ్ :
మోసగాళ్లు స్క్రీన్ షేరింగ్ ద్వారా మీ వ్యక్తిగత సమారాన్ని తస్కరించే అవకాశం ఉంది. కొత్త లేదా అనుమానాస్పద నంబర్లతో స్క్రీన్ షేర్ చేసేటప్పుడు ఈ ఫీచర్ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది.
డివైస్ లింకింగ్ అలర్ట్స్ :
మీ వాట్సాప్ అకౌంట్‌ను ఇతరులు అనధికారికంగా వేరే యాప్స్ లేదా డివైస్‌లలో లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫీచర్ వెంటనే అలర్ట్ చేస్తుంది.
టూ-స్టెప్ వెరిఫికేషన్ :
మీ వాట్సాప్ అకౌంట్‌కు అదనపు భద్రతను చేకూర్చడానికి 6 అంకెల పిన్‌ను సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ అనుమతి లేకుండా ఎవరూ ఖాతాను ఓపెన్ చేయలేరు.
బ్లాక్ అండ్ రిపోర్ట్ :
ఏదైనా నంబర్ లేదా మెసేజ్ మోసపూరితంగా అనిపిస్తే, వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి వాట్సాప్‌కు రిపోర్ట్ చేసే సదుపాయం ఉంటుంది.
చాట్ లాక్ :
మీ వ్యక్తిగత మరియు గోప్యమైన చాట్స్‌ను ఎవరికీ కనిపించకుండా ఫింగర్‌ప్రింట్ లేదా పాస్‌వర్డ్ సహాయంతో లాక్ చేసుకోవచ్చు.
డిస్అపియరింగ్ మెసేజెస్ :
మీరు పంపిన మెసేజ్‌లు నిర్ణీత సమయం (24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులు) తర్వాత తొలగిపోయేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది.
ప్రైవసీ సెట్టింగ్స్ :
మీ ప్రొఫైల్ పిక్చర్, లాస్ట్ సీన్, అబౌట్, ఆన్‌లైన్ స్టేటస్‌ను ఎవరెవరు చూడాలనే దానిపై పూర్తి నియంత్రణను ఇస్తుంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ :
వాట్సాప్‌లో మీరు చేసే ప్రతీ మెసేజ్, కాల్ పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మీ మధ్య జరిగే చాట్లను మూడో వ్యక్తి లేదా స్వయంగా వాట్సాప్ కూడా చూడలేదు.