రాగి బాటిల్‌లో నీరు పోసి అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగడం అతి పెద్ద తప్పు. ఆమ్ల గుణం ఉన్న పదార్థాలు రాగితో చర్య జరిపి విషపూరితంగా మారుతాయి. దీనివల్ల వాంతులు, వికారం కలుగుతాయి.
అతిగా తాగకండి:
రోజంతా రాగి బాటిల్ నీరే తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీరంలో రాగి మోతాదు పెరిగి కాలేయం, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సరైన సమయం:
రాగి పాత్రలో నీటిని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిల్వ ఉంచాలి. అప్పుడే రాగిలోని అయాన్లు నీటిలో కలిసి బ్యాక్టీరియాను చంపుతాయి. రాత్రంతా నిల్వ ఉంచి ఉదయం తాగడం ఉత్తమం.
వేడి నీరు పోయవద్దు:
రాగి బాటిల్‌లో ఎప్పుడూ మరిగే వేడి నీటిని లేదా ఐస్ లాంటి చల్లటి నీటిని పోయకూడదు. ఇది రాగి సహజ గుణాలను దెబ్బతీస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరే శ్రేయస్కరం.
పరిమితి ముఖ్యం:
రోజుకు కేవలం 250 నుంచి 500 ml రాగి నీటిని తాగడం శరీరానికి సరిపోతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
శుభ్రత తప్పనిసరి:
రాగి పాత్రలు లోపల త్వరగా నల్లబడతాయి. సరిగ్గా శుభ్రం చేయని పాత్రల్లో నీరు తాగితే ఇన్ఫెక్షన్లు వస్తాయి. నిమ్మకాయ, ఉప్పు లేదా చింతపండుతో క్రమం తప్పకుండా తోమాలి.
నేలపై ఉంచవద్దు:
రాగి పాత్రను నేరుగా నేలపై ఉంచకూడదు. ఏదైనా చెక్క స్టాండ్ లేదా టేబుల్ మీద ఉంచడం వల్ల దాని శక్తి క్షేత్రం దెబ్బతినకుండా ఉంటుంది.
ఆహార పదార్థాలు వద్దు:
రాగి పాత్రలను కేవలం నీటి కోసం మాత్రమే వాడాలి. పాలు, పెరుగు లేదా ఇతర ఆహార పదార్థాలను ఇందులో నిల్వ చేస్తే అవి విషపూరిత చర్యలకు గురవుతాయి.
కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త:
కిడ్నీ లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా రాగి నీటిని అధికంగా తీసుకోకూడదు.
మచ్చలు ఉన్న బాటిల్ వాడకండి:
బాటిల్ లోపల పచ్చటి మచ్చలు కనిపిస్తే అది ప్రమాదకరం. అటువంటి పాత్రలను బాగా తోమి ఆ మచ్చలు పోయే వరకు వాడకూడదు.