బండి మీద రుచి ఇంట్లోనే:

బండ్ల మీద దొరికే వేడి వేడి పెసర పునుగుల రుచి ఇక మీ ఇంట్లోనే. కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.
ఈవెనింగ్ స్నాక్స్ క్రేజ్:
చాలామంది ఇంట్లో చేసినా బండి మీద దొరికే రుచి రాదని బాధపడతారు. అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు పెసరపప్పు, 2-3 స్పూన్ల బియ్యం పిండి, 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయ ఉంటే చాలు.
3-4 గంటలు నానబెట్టండి:
పెసరపప్పును కనీసం 3 నుంచి 4 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. వీలైతే పొట్టు ఉన్న పప్పు వాడటం మంచిది.
బరకగా, గట్టిగా రుబ్బండి:
నానిన పప్పును నీళ్లలా మెత్తగా రుబ్బకూడదు. నీళ్లు ఎక్కువగా వేయకుండా బరకగా, గట్టిగా రుబ్బితే పునుగులు గుల్లగా వస్తాయి.
చేత్తో 2-3 నిమిషాలు:
రుబ్బిన పిండిని గిన్నెలో వేసి చేత్తో 2-3 నిమిషాలు కలపాలి. పిండిలోకి గాలి చేరి పునుగులు దూదిలా సాఫ్ట్‌గా వస్తాయి.
కరకరలాడే సీక్రెట్:
పిండిలో 2 నుంచి 3 స్పూన్ల బియ్యం పిండి కలపాలి. బండ్ల మీద దొరికే పునుగుల్లా కరకరలాడటానికి ఇదే ప్రధాన కారణం.
రుచి కోసం ఇవి కలపండి:
సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి.
బంగారు రంగు వచ్చే వరకు:
డీప్ ఫ్రైకి సరిపడా నూనె బాగా కాగనివ్వాలి. మీడియం ఫ్లేమ్‌లో చిన్న చిన్న పునుగులుగా వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
చట్నీతో సర్వ్ చేయండి:
వేడి వేడి పెసరపునుగులను అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేస్తే ఆ రుచి మాటల్లో చెప్పలేం.