Summer Health: వేసవిలో గ్యాస్ట్రో ముప్పు...తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

పెరుగుతున్న కేసుల ఉధృతి:
హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి నిత్యం 20 గ్యాస్ట్రో కేసులు వస్తుండగా, నీలోఫర్‌లో 30కి పైగా చిన్నారులు అతిసారతో చేరుతున్నారు. ప్రైవేట్ సెంటర్లలో కూడా ఈ కేసులు 30% పెరిగాయి.
ఆహారం ఎందుకు విషమవుతోంది?:
అధిక ఉష్ణోగ్రతల వల్ల బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల వండిన ఆహారం గంటల్లోనే పాడైపోయి, తిన్న వెంటనే ఫుడ్ పాయిజనింగ్‎కు దారితీస్తోంది.
కలుషిత నీరే ప్రధాన శత్రువు:
ఎండల వల్ల నీటి నిల్వలు తగ్గి, పైపుల్లో కలుషిత నీరు చేరే అవకాశం ఉంది. ఈ నీటిని నేరుగా తాగడం వల్ల టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.
ముఖ్యమైన లక్షణాలు:
వికారం, ఆగని వాంతులు, కడుపులో నొప్పి (తిమ్మిర్లు), విరేచనాలు, తీవ్రమైన నీరసం మరియు జ్వరం ఉంటే తక్షణమే అప్రమత్తం కావాలి.
తాగే నీటిలో జాగ్రత్త:
కేవలం ఫిల్టర్ నీటిపైనే ఆధారపడకుండా, నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాతే తాగడం అత్యంత శ్రేయస్కరం. బయట దొరికే విప్పదీసిన నీటిని తాగకండి.
నిల్వ ఆహారానికి నో చెప్పండి:
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం లేదా ఉదయం వండినది రాత్రికి తినడం వేసవిలో మంచిది కాదు. రోడ్డు పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, జ్యూస్‌లకు వీలైనంత దూరంగా ఉండాలి.
ఓఆర్ఎస్ (ORS) - ప్రాణరక్షకి:
శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, మజ్జిగతో పాటు స్వల్ప లక్షణాలు ఉన్నప్పుడే ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలి.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి?:
నోరు ఎండిపోవడం, కళ్లు లోతుకు పోవడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇంటి చిట్కాలు వదిలి వెంటనే ఆసుపత్రిలో చేరాలి.