తక్షణ శక్తికి మార్గం:

రోజూ 10 నుంచి 20 పిస్తా పప్పులు తినడం వల్ల నీరసం తగ్గి శరీరం రోజంతా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది.
తినే విధానం:
వీటిని పచ్చిగా అయినా తినొచ్చు లేదా కొద్దిగా వేయించి సాయంత్రం పూట హెల్దీ స్నాక్స్‌లా తీసుకోవచ్చు.
జ్ఞాపకశక్తి పెరుగుదల:
పిస్తాల్లోని పోషకాలు మెదడు పనితీరును వేగవంతం చేసి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
కంటి చూపుకి మేలు:
వీటిలో ఉండే లుటిన్ అనే పోషకం కంటి చూపును మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది.
షుగర్ కంట్రోల్:
పిస్తా పప్పులు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యం:
శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, హృదయ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి.
వంటకాల్లో సువాసన, రుచి:
హల్వా, పాయసం వంటి తీపి వంటకాలతో పాటు బిర్యానీల్లోనూ వీటిని ప్రత్యేక రుచి కోసం వాడతారు.
బరువు అదుపు:
తక్కువ కేలరీలు ఉండి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్.
పోషకాల నిధి: విటమిన్లు,
మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా చాలా శ్రేష్ఠమైనది.
మితంగా తీసుకోవడం మేలు:
ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సరే, రోజుకు 10-20 కి మించి పరిమితి దాటి తీసుకోకూడదు.