ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం:

క్షార స్వభావం ఉన్న బేకింగ్ సోడా కడుపులోని అధిక ఆమ్లాన్ని తటస్థీకరించి గుండెల్లో మంటను తగ్గిస్తుంది.
నోటి దుర్వాసనకు చెక్:
ఇది నోటిలోని యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేసి, చెడు వాసనను అరికట్టడంలో సహాయపడుతుంది.
పళ్లపై మరకలు మాయం:
సహజసిద్ధమైన క్లీనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తూ పళ్లపై ఉన్న పసుపు మరకలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
మృత చర్మ కణాల తొలగింపు:
నీటితో కలిపి పేస్ట్‌లా చేసి వాడితే చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి.
దురద, మంట నుంచి ఉపశమనం:
కీటకాలు లేదా దోమలు కుట్టిన చోట బేకింగ్ సోడా పేస్ట్ రాస్తే దురద తగ్గుతుంది.
కండరాల అలసట నివారణ:
తీవ్రమైన వ్యాయామం చేసే సమయంలో కండరాలలో ఆమ్లత్వం పెరగకుండా అలసటను తగ్గిస్తుంది.
జీర్ణ వ్యవస్థకు మేలు:
తిన్న ఆహారం సరిగ్గా అరగక కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
కిడ్నీల ఆరోగ్యానికి పరిశోధనలు:
దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల్లో రక్తంలోని యాసిడ్ స్థాయిలను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
అతిగా వాడితే బిపి ప్రమాదం:
ఇందులో సోడియం ఎక్కువ. కాబట్టి పరిమితికి మించి వాడితే బీపీ పెరిగే ప్రమాదం ఉంది.
వైద్యుల సలహా తప్పనిసరి:
గర్భిణులు, గుండె లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీనిని నేరుగా తీసుకోకూడదు.