పోషకాల గని:

బ్రకోలీలో విటమిన్ సి, కె, ఫైబర్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మెండుగా ఉంటాయి.
చర్మ సౌందర్యం:
ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, దీనివల్ల చర్మం కాంతివంతంగా మారి వృద్ధాప్య ఛాయలు దరిచేరవు.
నేచురల్ హైడ్రేషన్:
బ్రకోలీలో సుమారు 92 శాతం నీటి శాతం ఉంటుంది, ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది.
సూర్యరశ్మి నుండి రక్షణ:
ఇందులో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
కంటి చూపు మెరుగు:
కంటి ఆరోగ్యాన్ని కాపాడే లూటిన్ వంటి పోషకాలు ఇందులో ఉండటం వల్ల దృష్టి సమస్యలు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి:
విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి వ్యాధులపై పోరాడే శక్తి లభిస్తుంది.
హార్మోన్ల సమతుల్యత:
హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యతో బాధపడేవారికి బ్రకోలీ మంచి ఔషధంలా పనిచేస్తుంది.
ఎముకల బలం:
ఇందులో విటమిన్ కె, కాల్షియం ఉండటం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి.
జీర్ణక్రియ మెరుగు:
అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు తొలగి జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
ముఖ్య గమనిక:
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, థైరాయిడ్ సమస్య ఉన్నవారు బ్రకోలీని తినే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.