జీర్ణశక్తి పెరుగుతుంది:

పరగడుపున కరివేపాకు నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమై ఆహారం త్వరగా అరుగుతుంది.
జీర్ణ సమస్యలకు చెక్:
గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి రోజువారీ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
వేగంగా బరువు తగ్గుతారు:
కరివేపాకులో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ. ఇది శరీరంలో మెటబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగిస్తుంది.
ఆకలి నియంత్రణ: .
ఇవి తింటే అనవసరమైన ఆకలి కోరికలు తగ్గి ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతారు
షుగర్ లెవెల్స్ కంట్రోల్:
రక్తంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నియంంత్రిస్తుంది.
కుదుళ్లు దృఢపడతాయి:
కరివేపాకులోని పోషకాలు కుదుళ్లకు తగిన పోషణ అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి.
తెల్ల జుట్టుకు చెక్:
ప్రతిరోజూ పరగడుపున కరివేపాకు తీసుకోవడం వల్ల జుట్టు అకాలంగా తెల్లబడటం తగ్గుతుంది.
కాలేయ శుద్ధి :
కరివేపాకులోని డీటాక్సిఫైయింగ్ గుణాలు లివర్ లోని వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపుతాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.
ఎలా తీసుకోవాలి?:
ప్రతిరోజూ ఉదయాన్నే 4 నుంచి 6 తాజా కరివేపాకులను నేరుగా నమలవచ్చు లేదా వాటితో టీ/కషాయం చేసుకుని తాగవచ్చు.