మునగకాయల్లో విటమిన్ సి, విటమిన్ ఎ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.
ఎముకలు ఉక్కులా మారుతాయి
మునగకాయల్లో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, వృద్ధాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధిస్తాయి.
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం
దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి మునగకాయ ఒక వరమనే చెప్పాలి. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది
మునగకాయల్లో పీచుపదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది
మునగకాయలు శరీరంలోని టాక్సిన్స్ (విషపదార్థాలను) బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, రక్తపోటును (బిపి) అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
కంటి చూపు మెరుగవుతుంది
విటమిన్ ఎ అధికంగా ఉండటం వల్ల మునగకాయలు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యలను ఇవి నివారిస్తాయి.
చర్మం, జుట్టు ఆరోగ్యం
దీనిలో ఉండే పోషకాలు చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచుతాయి. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా మారుస్తాయి.
శ్వాసకోశ సమస్యలకు చెక్
మునగకాయల్లో ఉండే యాంటీ అలర్జిక్ గుణాలు ఉబ్బసం (ఆస్తమా), బ్రాంకైటిస్, ఇతర గొంతు ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి.