Suzuki e-Sky: 310 కి.మీ రేంజ్, సూపర్‌ ఫీచర్లు ..సుజుకి పొట్టి కార్ ఈ-స్కై వచ్చేసింది

డిజైన్:
వ్యాగన్-ఆర్‌ ఆధారిత బాక్సీ డిజైన్‌తో వస్తున్న ఈ కార్ తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ క్యాబిన్ స్పేస్‌ను అందిస్తుంది.
ధర వివరాలు:
యూకే మార్కెట్లో దీని ప్రారంభ ధర 20,000 పౌండ్ల కంటే తక్కువ (సుమారు రూ. 26.08 లక్షలు)గా ఉండనుంది.
మోటార్ & పవర్:
జపాన్ కే-కార్ నిబంధనల ప్రకారం ఇందులో 63 bhp పవర్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు.
డ్రైవింగ్ రేంజ్:
ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 310 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
సైజు
ఈ కార్ పొడవు 3,395 మి.మీ, వెడల్పు 1,475 మి.మీ, ఎత్తు 1,625 మి.మీ కాగా, వీల్‌బేస్ 2,460 మి.మీ ఉంటుంది.
టర్నింగ్ రేడియస్
కేవలం 4.4 మీటర్ల టర్నింగ్ రేడియస్ ఉండటం వల్ల రద్దీగా ఉండే సిటీ రోడ్లపై సులువుగా డ్రైవ్ చేయవచ్చు.
ఇన్ఫోటైన్‌మెంట్
క్యాబిన్‌లో 10.1 ఇంచీల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది.
ఈజీ డ్రైవ్ పెడల్
సిటీ ట్రాఫిక్‌లో పదే పదే బ్రేక్ వేసే పని లేకుండా ఒకే పెడల్‌తో వేగాన్ని నియంత్రించే 'ఈజీ డ్రైవ్ పెడల్' ఫీచర్ ఉంది.
వి2ఎల్ ఫంక్షనాలిటీ
వెహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్ ద్వారా ఈ కారు బ్యాటరీ నుంచే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ వాడుకోవచ్చు.
ఎనర్జీ ఎఫిషియెన్సీ
చలికాలంలో బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేకమైన డైరెక్ట్ హీట్-పంప్ అండ్ ఎయిర్-హీటెడ్ సిస్టమ్‌ను అందించారు.