Apple: యాపిల్ కొనేముందు తియ్యగా ఉన్నాయో లేదో తెలుసుకోండిలా.!
బరువును బట్టి ఎంచుకోండి:
యాపిల్ సైజు ఎంత ఉందనే దానికంటే దాని బరువు ముఖ్యం. చూడటానికి చిన్నగా ఉన్నా, చేతిలో పట్టుకుంటే బరువుగా అనిపించే ఆపిల్స్‌లో జ్యూస్ పుష్కలంగా ఉంటుంది.
వాసన చూసి కొనండి:
మంచిగా పండిన తియ్యటి యాపిల్స్ తొడ(Stem) భాగం దగ్గర మంచి సువాసన వస్తాయి. ఎలాంటి వాసన రాకపోతే ఆ పండు సరిగ్గా పండలేదని లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండి సువాసన కోల్పోయిందని గ్రహించాలి.
రంగు కంటే గట్టిదనే ముఖ్యం:
యాపిల్ ఎర్రగా ఉందంటేనే తియ్యగా ఉంటుందని రూల్ లేదు. పండుపై వేలితో నొక్కి చూస్తే అది గట్టిగా ఉండాలి. మెత్తగా లేదా ఎక్కడైనా చిన్న మచ్చ ఉన్నా ఆ పండును పక్కన పెట్టేయడం మంచిది.
తొడ భాగం పరిశీలించండి:
పండుపైన ఉండే తొడ (Stem) కాస్త తాజాగా, పచ్చగా లేదా గట్టిగా అతుక్కుని ఉండాలి. ఆ తొడ చుట్టూ చర్మం ముడతలు పడినా లేదా లోపలికి గుంతలా పడినా ఆ పండు ఎప్పటిదో అని అర్థం చేసుకోవాలి.
చిన్నగా తట్టి చూడండి:
పుచ్చకాయను పరీక్షించినట్టు ఆపిల్‌ను కూడా మీ చేతివేళ్లతో చిన్నగా ట్యాప్ చేసి చూడవచ్చు. లోపల నుంచి గట్టిగా శబ్దం వస్తే అది చాలా ఫ్రెష్‌గా, జ్యూసీగా ఉన్నట్ట లెక్క.
చర్మం నిగనిగలాడుతూ ఉండాలి:
యాపిల్ పైభాగం మరీ కృత్రిమంగా మెరిసిపోకుండా సహజమైన మెరుపుతో, ముడతలు లేకుండా నునుపుగా ఉండాలి.
పొడిబారిన పండ్లకు దూరంగా ఉండాలి:
చూడటానికి కాస్త డ్రైగా లేదా వాడిపోయినట్లు కనిపించే ఆపిల్స్‌ను అస్సలు కొనుగోలు చేయకూడదు. వాటిలో పోషకాలు కూడా తగ్గిపోతాయి.
సీజనల్ రకాలను గుర్తించడం:
మార్కెట్లో లభించే రకరకాల యాపిల్స్‌లో ఏది తియ్యగా ఉంటుందో గమనించి, నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవడం ఉత్తమం.
నిల్వ ఉండే పద్ధతులు:
తెచ్చుకున్న యాపిల్స్‌ను వెంటనే ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా, తియ్యగా ఉంటాయి.