కొత్త ప్రొడక్ట్ లాంచ్

కార్ల తయారీ సంస్థ టెస్లా చిన్నారుల కోసం పెడల్స్ లేని సరికొత్త బ్యాలెన్స్ బైక్‌ను తెచ్చింది.
వయస్సు పరిమితి
ఈ ప్రత్యేక బైక్‌ను 2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారుల కోసం రూపొందించారు.
ధర వివరాలు
దీని ధర 225 డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.19,000 గా ఉంది.
భారీ డిమాండ్
మార్కెట్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ బైక్‌లన్నీ అమ్ముడై వెబ్‌సైట్‌లో స్టాక్ అవుట్ అయ్యాయి.
బరువు మోసే సామర్థ్యం
ఈ బైక్ సుమారు 35 కిలోల వరకు బరువు ఉన్న పిల్లలను సులభంగా మోయగలదు.
తేలికపాటి మెగ్నీషియం ఫ్రేమ్
బైక్‌ను తేలికపాటి మెగ్నీషియం ఫ్రేమ్‌తో చేయడం వల్ల పిల్లలు ఈజీగా కంట్రోల్ చేయగలరు.
అడ్జస్టబుల్ సీట్
పిల్లల ఎత్తుకు తగినట్లుగా సీటును ఐదు రకాలుగా అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంది.
మోటార్, పెడల్స్ లేవు
ఇందులో పెడల్స్ ఉండవు, పిల్లలు కాళ్లతోనే నేలపై నెడుతూ బ్యాలెన్స్ నేర్చుకోవాలి.
టెస్లా స్టైలిష్ డిజైన్
బైక్ ముందు భాగంలో టెస్లా ప్రసిద్ధ "T" లోగోతో పాటు స్టైలిష్ లుక్‌ను ఇచ్చారు.
డెలివరీ అప్‌డేట్
ఈ బైక్ డెలివరీలు ఆగస్టు నెలాఖరు నుండి ప్రస్తుతం అమెరికాలో మాత్రమే ప్రారంభం కానున్నాయి.