Dates: ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవడంలో మనం తీసుకునే ఆహారం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. పురాతన కాలం నుంచే మన సంప్రదాయంలో ఖర్జూరాలు, పాలను ఆరోగ్యానికి అత్యంత శక్తివంతమైన ఆహారంగా భావిస్తున్నారు. రాత్రివేళ పాలలో ఖర్జూరాలను నానబెట్టి ఉదయం లేదా పడుకునే ముందు తీసుకోవడం వల్ల శరీరానికి అందే పోషకాలు రెట్టింపు అవుతాయి. పాలలో ఉండే ప్రొటీన్లు, క్యాల్షియం అలాగే ఖర్జూరంలో లభించే ఐరన్, ఫైబర్ కలయిక శరీరానికి ఎనలేని శక్తిని అందించి అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.