బాలీవుడ్ ఎంట్రీ

2014లో 'ఫగ్లీ' సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కియారా, తన అమాయకమైన రూపంతో తొలి సినిమాలోనే విమర్శకుల దృష్టిని ఆకర్షించింది.
'ధోని' బయోపిక్‌తో టర్నింగ్ పాయింట్
'M.S. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో సాక్షి ధోని పాత్రలో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నేచురల్ యాక్టింగ్, క్యూట్ లుక్స్ కుర్రకారును ఫిదా చేశాయి.
'భరత్ అనే నేను'తో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ
సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టి, తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
సెన్సేషనల్ 'ప్రీతి' - కబీర్ సింగ్ మేనియా
'కబీర్ సింగ్' సినిమాలో ప్రీతి పాత్రలో కియారా కనబరిచిన నటన, ఆమె ఇన్నోసెంట్ అందం దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్‌గా మారింది. ఈ సినిమాతో ఆమె నంబర్ వన్ హీరోయిన్ రేసులోకి దూసుకొచ్చింది.
పర్‌ఫెక్ట్ గ్లామర్ & హెల్దీ ఫిట్‌నెస్
జిమ్ వర్కౌట్స్, యోగా, సమతుల్యాహారంతో పర్‌ఫెక్ట్ ఫిగర్‌ను మెయింటెన్ చేసే కియారా, వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ ఏ దుస్తుల్లోనైనా దేవతలా మెరిసిపోతుంది.
డ్యాన్స్ & ఎక్స్‌ప్రెషన్ క్వీన్
'భూల్ భులయా 2', 'గోవిందా నామ్ మేరా' చిత్రాల్లో తన స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్, గ్లామరస్ ప్రెజెన్స్‌తో నెటిజన్లను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
'షేర్‌షా' డివైన్ పెయిర్
'షేర్‌షా' సినిమాలో డింపుల్ చీమా పాత్రలో కియారా నటన కన్నీళ్లు పెట్టించింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.
రియల్ లైఫ్ సిద్ధార్థ్ మల్హోత్రా తో పెళ్లి
సినిమా రీల్ లవ్ రియల్ లవ్‌గా మారి, బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుని మోస్ట్ బ్యూటిఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా నిలిచారు.
పాన్-ఇండియా స్టార్‌డమ్
గ్లోబల్ డైరెక్టర్ శంకర్-రామ్ చరణ్ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' తో పాటు 'వార్ 2', 'టాక్సిక్' వంటి బిగ్ బడ్జెట్ పాన్-ఇండియా ప్రాజెక్టులతో ఇండియాలోనే టాప్ బిజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
నేటితరం ఫ్యాషన్ ఐకాన్
రెడ్ కార్పెట్స్, ఫ్యాషన్ వీక్స్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్‌లో తన మార్క్ స్టైలింగ్, రేడియంట్ స్మైల్‌తో కోట్లాది మంది యువతులకు ఫ్యాషన్ ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది.