ప్రతిరోజూ బీట్‎రూట్ తింటే కలిగే 9 అద్భుత ప్రయోజనాలు ఇవే

బీట్ రూట్ లో పోషకాలు
బీట్ రూట్ లో పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న బీట్ రూట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
శక్తి పెరుగుతుంది
ఇందులో కండరాల్లో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచే సహాజ నైట్రేట్ల మూలం ఉంటుంది. అందుకే ఇది తింటే శక్తి పెరుగుతుంది. బాడీ బిల్డింగ్, అథ్లేట్స్ దీన్ని డైట్లో చేర్చుకోవచ్చు.
గుండె ఆరోగ్యం
బీట్ రూట్ లో నైట్రెట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది.
దీర్ఘకాలిక వ్యాధులు
బీట్ రూట్ లో శక్తివంతమైన బీటాలైన్స్ ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని కంట్రోల్లో ఉంచి శరీరంలో మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.
షుగర్ కంట్రోల్
బీట్రూట్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ , అధిక ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి. షుగర్ లెవల్స్ ను నిర్వహిచే గ్లూకోజ్ సమతుల్య లెవల్స్ ను పెంచుకునేవారికి మేలు చేస్తాయి.
మెదడు పనితీరు
బీట్ రూట్ లోని నైట్రేట్స్ నుంచి ఉత్పత్తి అయిన నైట్రిక్ ఆక్సైడ్ మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడం
కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండే బీట్ రూట్ డైట్లో చేర్చుకుంటే బరువు తగ్గుతారు.
ఇమ్యూనిటీ
బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు, అనారోగ్య సమస్యలకు గురికాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది.
టాక్సిక్స్
ప్రతిరోజూ బీట్ రూట్ తింటే శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.