ఈ నూనె ముఖానికి రాస్తే తెల్లగా మెరిసిపోతుంది

వేపనూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. వేప నూనె రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
వేపనూనెలో ఉండే ఓయిలిక్..లినోలినిక్ యాసిడ్ చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.
వేపనూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
వేపనూనెలో ఉండే పోషకాల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. వేపనూనె రాయడం వల్ల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
వేపనూనె ముఖానికి రాయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని క్లియర్ చేస్తాయి
వేపనూనెలో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ నూనె రాసుకుంటే చర్మం ఎరుపెక్కడం, వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
వేపనూనె రాస్తే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మంపై నల్ల మచ్చలు ఏర్పడకుండా ఉంటాయి.
వేపనూనె రాసుకుంటే ముఖంపై సెబమ్ కంట్రోల్ అవుతుంది. దీంతో మొటిమలు దూరం అవుతాయి.
వేప నూనె రాసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.