తులసి-వేప తేనేతో కలిపి పరగడుపున తింటే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఇవే

తులసి-వేప-తేనె
వేప, తులసి, తేనె శక్తివంతమైన సహజ నివారణలు. ఈ మూడింటిని కలిపి తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.
ఇమ్యూనిటీ
వేప, తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. తేనెలో సహజ లక్షణాలుఉన్నాయి. ఈ మూడింటిని కలిపి తింటే జలుబు, ఇన్ఫెక్షన్లు, ఫ్లూ నుంచి కాపాడుతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.
కాలేయం
వేపాకులు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపుతుంది. తులసి కాలేయ ఆరోగ్యం కాపాడుతుంది. తేనె హైడ్రేట్లకు ప్రసిద్ధి. ఈ మూడు కూడా చర్మానికి మేలు చేస్తాయి.
జీర్ణక్రియ
తులసి, వేప, తేనె ఈ మూడు కూడా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా ఉబ్బరం తగ్గుతుంది.
శ్వాసకోశ
ఈ మూడింటి కలయిక శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. దగ్గు, జలుబు, ఆస్తమాను తగ్గిస్తాయి.
చర్మానికి పోషణ
వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ , తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని కాపాడుతాయి. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.
చక్కెర స్థాయి
ఈ మూడు కూడా శరీరంలోని షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. తేనెను మితంగా తీసుకోవాలి.
నోటి ఆరోగ్యం
వేప, తులసి నోటీ బ్యాక్టీరియాతో పోరాడుతాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. తేనె నోటిపూతలను కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడి, ఆందోళన
ఒత్తిడి, ఆందోళన తులసి ఒక అడాప్టోజెన్. ఇది ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. వేప మనస్సును శాంతంగా ఉంచుతుంది. తేనే శక్తిని అందిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తాయి.