Dragon Fruit : రోగాలన్నింటికీ చెక్ పెట్టే డ్రాగన్ ఫ్రూట్.. దీని అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు
పోషకాల గని:
డ్రాగన్ ఫ్రూట్‌లో క్యాలరీలు తక్కువగా ఉండి, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు మెండుగా ఉంటాయి.
రోగనిరోధక శక్తి:
ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇమ్యూనిటీని అమాంతం పెంచి వ్యాధుల బారి పడకుండా కాపాడతాయి.
క్యాన్సర్ నివారణ:
కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే గుణం దీనిలో ఉండటం వల్ల, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును ఇది తగ్గిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ:
పీచు పదార్థం, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మలబద్ధకాన్ని నివారించి, జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది.
బరువు నియంత్రణ:
ఇది తిన్న తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. మెటబాలిజం రేటును పెంచడం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది.
మధుమేహం అదుపు:
ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం ద్వారా రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిస్ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
గుండె భద్రం:
దీని గింజల్లో ఉండే ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.
ఎముకల దృఢత్వం:
ఇందులోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
రక్తహీనతకు చెక్:
ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనత సమస్యను దరిచేరనివ్వదు.
మెరిసే చర్మం, తక్షణ శక్తి:
దీని గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముడతలు, మొటిమలు తగ్గి చర్మం మెరుస్తుంది. అలాగే నీరసంగా ఉన్నప్పుడు ముక్కలు తింటే తక్షణ శక్తి లభిస్తుంది.