అక్షర్ ధామ్, ఢిల్లీ
మహర్షి వాస్తు శాస్త్ర ప్రమాణాల ప్రకారం రాజస్థానీ పింక్ శాండ్‌స్టోన్, ఇటాలియన్ మార్బుల్‌తో దీనిని నిర్మించారు. ఇనుము, రాగి వంటి లోహాలు ఏవీ వాడకుండా పూర్తిగా రాతితోనే రూపుదిద్దుకుంది. 10 అంతస్తుల ఎత్తులో ఉండే ఈ మందిరంలో 234 శిల్పకళా శోభిత స్తంభాలు, 9 గోపురాలు, 20,000 కంటే ఎక్కువ సాధువుల, భక్తుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే 134 నిలువెత్తు ఏనుగుల విగ్రహాలు మలచబడ్డాయి. స్వామినారాయణ్‌కు అంకితం చేసిన ఈ ఆలయంలో ఆయన 11 అడుగుల మూర్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. సీతారాములు, రాధాకృష్ణులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణుల పంచలోహ విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి.