360 డిగ్రీ కెమెరా వైభవం:

ఇరుకైన వీధుల్లో పార్కింగ్ చేయడం, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో సురక్షితంగా డ్రైవ్ చేయడానికి ఈ కెమెరా సెటప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
టాటా టియాగో
360 డిగ్రీ కెమెరా ఫీచర్ లభిస్తున్న కార్లలో అత్యంత తక్కువ ధర కలిగిన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఇది.
టియాగో క్రియేటివ్ వేరియంట్
టాటా టియాగోలోని క్రియేటివ్ ట్రిమ్ నుంచి ఈ 360 డిగ్రీ కెమెరా ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఫీచర్‌గా అందుబాటులో ఉంది.
టియాగో ధరల వివరాలు
టియాగో పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 8.24 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, ఆటోమేటిక్ వేరియంట్ రూ. 8.87 లక్షల ఆన్-రోడ్ ధరకు లభిస్తోంది.
టియాగో సీఎన్‌జీ మోడళ్లు:
మైలేజ్ కోరుకునే వారి కోసం టియాగో సీఎన్‌జీ మాన్యువల్ రూ. 9.14 లక్షలు, సీఎన్‌జీ ఆటోమేటిక్ రూ. 9.79 లక్షల ఆన్-రోడ్ ధరకు అందుబాటులో ఉన్నాయి.
టాటా పంచ్
భారీ డిమాండ్ ఉన్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో అడ్వెంచర్ వేరియంట్ నుంచి 360 డిగ్రీ కెమెరా ఆప్షన్ లభిస్తుంది.
పంచ్ ధరల రేంజ్:
పంచ్ పెట్రోల్ మాన్యువల్ ఆన్ రోడ్ ధర రూ. 9.04 లక్షలు, ఆటోమేటిక్ రూ. 9.72 లక్షలు, సీఎన్‌జీ మాన్యువల్ రూ. 9.97 లక్షలుగా ఉంది.
టాటా ఆల్ట్రోజ్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉండే టాటా ఆల్ట్రోజ్ క్రియేటివ్ వేరియంట్‌లో ఈ 360 డిగ్రీ కెమెరా సెటప్‌ను అమర్చారు.
ఆల్ట్రోజ్ ఆన్-రోడ్ ధర:
రూ. 10 లక్షల బడ్జెట్ పరిమితిలో ఆల్ట్రోజ్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ. 9.48 లక్షల ఆన్-రోడ్ ధరకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
త్వరలోనే టాటా సఫారీ ఈవీ
ఎలక్ట్రిక్ కార్ ప్రియుల కోసం దీపావళి నాటికి ఏకంగా 540 డిగ్రీల కెమెరా, ADAS ఫీచర్లతో టాటా సఫారీ ఈవీ మార్కెట్లోకి రాబోతోంది.