కార్డు వాడకపోతే స్కోరు తగ్గుతుందా.?

క్రెడిట్ కార్డును ఉపయోగించనంత మాత్రాన మీ క్రెడిట్ స్కోరు వెంటనే తగ్గదు. అయితే, ఖాతా స్థితి, క్రెడిట్ వినియోగం వంటి అంశాలు స్కోరుపై ప్రభావం చూపవచ్చు.
బ్యాంకు కార్డును మూసివేయవచ్చా.?
దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు లేని కార్డును బ్యాంకు ఇన్‌యాక్టివ్‌గా పరిగణించవచ్చు. సంబంధిత నిబంధనలను బట్టి కార్డు సేవలను నిలిపివేసే అవకాశం ఉంటుంది.
ముందుగానే సమాచారం వస్తుందా.?
కార్డు నిలిపివేతకు సంబంధించిన విధానం బ్యాంకును బట్టి మారుతుంది. అందువల్ల మీకు నోటీసు వస్తుందని భావించి నిర్లక్ష్యం చేయకుండా, కార్డు నిబంధనలను పరిశీలించడం మంచిది.
క్రెడిట్ పరిమితి తగ్గితే ఏమవుతుంది.?
మీ వద్ద ఉన్న కార్డును క్లోజ్ చేస్తే, అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్‌ తగ్గవచ్చు. ఖర్చులు అదే స్థాయిలో కొనసాగితే మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది.
30 శాతం పరిమితి ఎందుకు ముఖ్యం.?
మొత్తం క్రెడిట్ పరిమితిలో 30 శాతం లోపే వినియోగాన్ని ఉంచుకోవడం సాధారణంగా మంచిదిగా భావిస్తారు. అయితే, ఇది కచ్చితమైన స్కోరు హామీ కాదు.
పాత కార్డు క్లోజ్ చేస్తే నష్టమా.?
ఎక్కువ కాలంగా ఉన్న క్రెడిట్ ఖాతా మీ క్రెడిట్ చరిత్రకు ఉపయోగపడవచ్చు. దాన్ని క్లోజ్ చేయ‌డం వల్ల వెంటనే స్కోరు తగ్గుతుందని చెప్పలేం. ప్రభావం మీ క్రెడిట్ రిపోర్ట్‌, స్కోరింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
వార్షిక రుసుమును గమనించండి
ఉపయోగించని కార్డుకు ప్రతి ఏడాది రుసుము చెల్లించాల్సి వస్తే, దాన్ని కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉందో లేదో అంచనా వేయాలి
కార్డును యాక్టివ్‌గా ఎలా ఉంచాలి.?
అవసరమైన విద్యుత్ బిల్లు, ఇంధన కొనుగోలు వంటి చిన్న ఖర్చులకు కార్డును ఉపయోగించవచ్చు. అయితే, ఖర్చు చేసిన మొత్తాన్ని గడువులోపు పూర్తిగా చెల్లించడం ద్వారా వడ్డీ, ఆలస్య రుసుముల భారాన్ని నివారించవచ్చు.
కార్డు కొనసాగించాలా, క్లోజ్ చేయాలా.?
కార్డుకు ఛార్జీలు లేకపోతే, భద్రతాపరమైన సమస్యలు లేకుంటే దాన్ని కొనసాగించడం ఉపయోగకరంగా ఉండవచ్చు.