వైభవ్ సూర్యవంశీ లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
దోహాలో విధ్వంసం
నవంబర్ 24న యూనివర్సిటీ ఆఫ్ దోహా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రౌండ్‌లో రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 11వ మ్యాచ్‌లో భారత్ ఏ, యూఏఈ తలపడ్డాయి. యూఏఈ 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఛేజింగ్ మొదటి ఓవర్ నుంచే దూకుడు
ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ మొదటి ఓవర్‌లోనే జాహిద్ అలీ బౌలింగ్‌లో 19 పరుగులు రాబట్టాడు. రెండో ఓవర్‌లో మరో 17 పరుగులు జోడించాడు.
16 బంతుల్లో హాఫ్ సెంచరీ
మూడో ఓవర్‌లో బాసిల్ హమీద్‌ను చీల్చిచెండాడుతూ 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అప్పటికే ఎనిమిది సిక్సర్లు, ఒక బౌండరీ కొట్టాడు.
28 బంతుల్లో 100
సూర్యవంశీ 28 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ మైలురాయికి చేరే సమయానికి అతడి ఖాతాలో 14 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.
ఫ్రేజర్-మెక్‌గర్క్ రికార్డు బద్దలు
ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 2023లో మార్ష్ కప్‌లో టాస్మానియాపై సౌత్ ఆస్ట్రేలియా తరఫున 29 బంతుల్లో చేసిన సెంచరీ రికార్డును వైభవ్ అధిగమించాడు.