విరాట్ కోహ్లీ 2027 టార్గెట్ ఫిక్స్!
కోహ్లీ టార్గెట్‌ ఫిక్స్
2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలవడమే తన ప్రధాన లక్ష్యమని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
ఇదే చివరి ప్రపంచకప్
భారత్‌ తరపున 2027 ప్రపంచకప్‌ తన చివరి ప్రపంచకప్‌ అని కోహ్లీ వెల్లడించాడు. ట్రోఫీనే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
2023 ఓటమి ఇంకా గుర్తే
2023 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తనకు ఇప్పటికీ బాధాకరమైన జ్ఞాపకమేనని కోహ్లీ చెప్పాడు.
ఫైనల్‌లో ఆ ఇన్నింగ్స్‌
2023 ఫైనల్‌లో 54 పరుగుల వద్ద ఔటైన కోహ్లీ.. భారీ స్కోరు సాధించి జట్టును గెలిపించలేకపోయానని గుర్తు చేసుకున్నాడు.
కప్‌ గెలవడమే ముఖ్యం
ఫైనల్‌లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాలని కల ఉన్నా.. వ్యక్తిగత ప్రదర్శన కంటే ప్రపంచకప్‌ గెలవడమే ముఖ్యమని చెప్పాడు.
మ్యాచ్‌లు గెలిపించాలి
ప్రపంచకప్‌లో వీలైనన్ని మ్యాచ్‌లను భారత్‌ కోసం గెలిపించాలనేదే తన వ్యక్తిగత లక్ష్యమని విరాట్ కోహ్లీ తెలిపాడు.
బ్యాటింగ్‌లో కొత్త దూకుడు
వన్డేల్లో మరింత స్వేచ్ఛగా ఆడాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే రిస్క్‌ తీసుకుంటానని చెప్పాడు.
350.. 360 పరుగుల లక్ష్యం
ప్రత్యర్థులు భారీ స్కోర్లపై దృష్టి పెడుతున్నప్పుడు భారత్‌ కూడా 350, 360 పరుగులు చేసేలా ఆడాలని కోహ్లీ అన్నాడు.
గణాంకాల్లోనూ మెరుగుదల
2024 చివర్లో 58.18గా ఉన్న కోహ్లీ వన్డే బ్యాటింగ్‌ సగటు తరువాత 58.59కు పెరిగింది. స్ట్రైక్‌రేట్‌ 99.80గా ఉంది.