Health: బాడీ ఆ విటమిన్ తగ్గిందంటే.. ఆస్పత్రి బెడ్డు ఎక్కాల్సిందే.!

B12 తగ్గితే నరాలకు ముప్పు
శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ B12 తగ్గితే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ఈ లక్షణాలు, ఆహార జాగ్రత్తలు తెలుసుకోండి.
ఎర్ర రక్తకణాలకు కీలకం
శరీరంలో ఎర్ర రక్తకణాలు పరిపక్వత చెందడానికి విటమిన్ B12 ఎంతో అవసరం. ఇది తగినంత ఉంటేనే రక్తకణాలు సరిగా ఎదుగుతాయి.
నరాలకు రక్షణ కవచం
నరాలను రక్షించే మైలిన్ పొర నిర్వహణకు కూడా విటమిన్ B12 ఎంతో అవసరం. ఈ పొర బాగుంటేనే నరాలు పదిలంగా ఉంటాయి.
అలసట, నీరసం వేధిస్తాయి
విటమిన్ B12 తగినంతగా లేకపోవడం వల్ల అలసట, నీరసం వేధిస్తాయి. ఎప్పుడూ నీరసంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.
రక్తహీనత ప్రమాదం
B12 తగినంత లేకపోతే రక్తహీనత బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు
విటమిన్ B12 లోపం ఉన్నవారిలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు వస్తాయి. ఇవి తరచూ వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు.
జ్ఞాపకశక్తి తగ్గుతుంది
B12 తగ్గడం వల్ల జ్ఞాపకశక్తి దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ లోపాన్ని సకాలంలో గుర్తించడం ముఖ్యం.
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు
నరాల సమస్యల ముప్పు
విటమిన్ B12 లోపం కొనసాగితే నరాల సమస్యలు ఎదురవుతాయి. నరాల ఆరోగ్యం కోసం ఈ విటమిన్ స్థాయిలపై శ్రద్ధ అవసరం.
పాలు, పెరుగు, గుడ్లు
B12 స్థాయులను కాపాడుకోవాలంటే పాలు, పెరుగు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చేపలు, మాంసం కూడా
చేపలు, మాంసం వంటి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా B12 స్థాయిలను కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.