భోజనం తర్వాత నడక

రాత్రి భోజనం తర్వాత ఎంతసేపు నడవాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. దీనిపై వైద్యులు ఇచ్చిన సూచనలు ఇవే.
వెంటనే నడవలొద్దు
రాత్రి భోజనం చేసిన వెంటనే నడవకూడదు. కాసేపు ఆగిన తర్వాతే నడక మొదలుపెట్టాలని వైద్యులు చెబుతున్నారు.
10-20 నిమిషాల నడక
భోజనం తర్వాత కాసేపు ఆగి 10 నుంచి 20 నిమిషాల పాటు నడవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు తెలిపారు.
జీర్ణక్రియ మెరుగు
ఇలా నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. తిన్న ఆహారం సులువుగా అరుగుతుంది.
గ్యాస్, అజీర్ణానికి చెక్
క్రమం తప్పకుండా నడిస్తే గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. భోజనం తర్వాత వచ్చే ఇబ్బందులు దూరమవుతాయి.
షుగర్ లెవల్స్ అదుపులో
భోజనం తర్వాత నడక వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
నడక మెల్లగా ఉండాలి
భోజనం తర్వాత చేసే నడక మెల్లగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. తేలికగా అడుగులు వేస్తూ సాగాలి.
పరిగెత్తొద్దు, వేగం వద్దు
భోజనం తర్వాత పరిగెత్తడం లేదా వేగంగా నడవడం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రక్తప్రసరణ తగ్గుతుంది
వేగంగా నడిస్తే జీర్ణాశయానికి అందాల్సిన రక్తప్రసరణ తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.
కడుపునొప్పి, వికారం ముప్పు
రక్తప్రసరణ తగ్గితే కడుపునొప్పి, వికారం వచ్చే ఆస్కారం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే మెల్లగా నడవడమే మేలు.