చలికాలంలో సాక్సుల వినియోగం

వింటర్ సీజన్‌లో చలి నుంచి తట్టుకునేందుకు కొందరు రాత్రి వేళల్లో కాళ్లకు సాక్సులు వేసుకుని నిద్రపోతారు.
పాదాలు వెచ్చగా మారడం
సాక్సులు ధరించడం వల్ల పాదాలు వెచ్చగా మారి చలి ప్రభావం తగ్గుతుంది.
రక్తనాళాల వ్యాకోచం
పాదాలు వెచ్చబడటంతో రక్తనాళాలు వ్యాకోచించి శరీరంలోని ఉష్ణోగ్రత బయటకు వెళుతుంది.
శరీర ఉష్ణోగ్రత తగ్గుదల
శరీరంలో ఉష్ణోగ్రత తగ్గడం అనే ప్రక్రియ నిద్రకు ఎంతో అనుకూలంగా మారుతుంది.
గాఢ నిద్రకు అవకాశం
శరీర ఉష్ణోగ్రత తగ్గడంతో మంచి నిద్ర పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
పాదాల పగుళ్లకు ఉపశమనం
మంచి నిద్రతో పాటు చలికాలంలో వచ్చే పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి.
సాక్సుల పరిశుభ్రత అవసరం
అయితే వేసుకునే సాక్సులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బిగుతుగా ఉండకూడదు
రక్తప్రసరణకు ఇబ్బంది కలగకుండా టైట్‌గా ఉండే సాక్సులకు బదులు వదులుగా ఉండేవి ఎంచుకోవాలి.
నిపుణుల హితవు
శుభ్రమైన, వదులుగా ఉండే సాక్సులు ధరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
సరైన జాగ్రత్తలతో మేలు
నిపుణులు చెప్పిన ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే శీతాకాలంలో హాయిగా నిద్రపోవచ్చు.