ఈ వారం రాశి ఫలాలు: నూతన పరిచయాలతో ఊహించని లాభాలు.. పెండింగ్ వ్యవహారాలన్నీ పరిష్కారం.. ఈ రాశిలో మీరున్నారా?

మేషం
కార్యక్రమాలు అనుకున్నట్లుగా సాగవు. అడుగడుగునా ఆటంకాలను అధిగమించాల్సి వస్తుంది. అవసరమైన మేర డబ్బు సమకూరుతుంది. సకాలంలో నిర్దేశిత సౌకర్యాలు సమకూరవు. తగాదాలు గోచరిస్తున్నాయి. మనోద్రేకాన్ని అదుపు చేసుకోండి. అధికారులు, పెద్దల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. తొందరపాటుగా వ్యవహరించకండి. కీలక తరుణంలో జీవిత భాగస్వామి సూచనలు ఉపకరిస్తాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. పైత్య సంబంధ సమస్యలుంటాయి.
వృషభం
చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ధనాదాయం బాగుంటుంది. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇరుగు పొరుగుతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. మానసిక, శారీరక ప్రశాంతతను పొందుతారు. వారాంతంలో ఆత్మీయులతో తగాదాలకు వీలుంది. చెప్పుడు మాటలు వినకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం
కొన్ని ఆటంకాలు వచ్చినా అభీష్టం నెరవేర్చుకుంటారు. కార్యజయం ఉంది. డబ్బుకి కూడా ఇబ్బందేమీ ఉండదు. నూతన వస్తువులను కొంటారు. వాహనయోగం ఉంది. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయమిది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కీలకమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలను పాటించండి. మేలు జరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోండి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త.
కర్కాటకం
కార్యసాధనలో బాగా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి పనిలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. విపరీతమైన ఖర్చుల వల్ల కొత్త అప్పులు చేయాల్సి రావచ్చు. బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధుమిత్రులతోనూ గొడవలు వచ్చే సూచన ఉంది. తెలివి తేటలకు సరైన గుర్తింపు లభించదు. నీచమైన ఆలోచనలు చేస్తారు. కీలక వేళల్లో ఆత్మీయుల సూచనలను పాటించడం వల్ల మేలు కలుగుతుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం శైలి కూడా కలవర పరుస్తుంది. వారాంతానికి ఒత్తిడి తగ్గి కాస్త ఉపశమనం లభిస్తుంది.
సింహం
ఎంత శ్రమించినా అభీష్టం నెరవేరక పోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను వారం మొదట్లోనే ముగించండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. పైగా అనూహ్యమైన ఖర్చులు చికాకు పెడతాయి. సంతాన సంబంధ వ్యవహారాలు కలవర పెడతాయి. దాయదులతో సమస్యలు తీరతాయి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు సరైనవి కావు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఆత్మీయ మిత్రుల సలహాలను పాటించండి. సోదరవర్గం కూడా తోడుగా ఉంటుంది. ముఖ్యమైన సమాచారం అందుతుంది.
కన్య
కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. ధైర్యాన్ని సడలనివ్వకుండా కృషి చేస్తే విజయం సిద్ధిస్తుంది. ఆదాయం మెరుగ్గానే ఉన్నా ఖర్చులూ పెరుగుతాయి. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. ఆత్మీయుల కలయిక ఎనలేని ఆనందాన్నిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల వల్ల సమస్యలు వచ్చే వీలుంది. అందరినీ ఓ కంట కనిపెట్టి ఉండండి. ఆత్మవిశ్వాసంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
తుల
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. గౌరవం పెరుగుతుంది. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో వినోదాన్ని పంచుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు. పూచీకత్తులకు దూరంగా ఉండండి.. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఖర్చులు తగ్గించండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.
వృశ్చికం
అప్రమత్తంగా ఉండాలి. పనుల పూర్తికి ఆటంకాలు ఉంటాయి. దక్షతతో కార్యాలను సాధిస్తారు. అవసరానికి సరిపడినంత డబ్బే సమకూరుతుంది. ఇచ్చిన మాట తప్పడం వల్ల నింద భరించాల్సి వస్తుంది. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. కీలక సమయాల్లో అదృష్టం తోడుగా నిలుస్తుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి. అనవసర ప్రయాణాలు మానుకోండి.
ధనుస్సు
శుభప్రదంగా ఉంటుంది. ఆకాంక్షలు నెరవేరతాయి. ఆర్థిక చికాకులు క్రమంగా తొలగుతాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. సంతాన వ్యవహారాలు కొలిక్కి రావడం తృప్తినిస్తుంది. నూతన పరిచయాలు మేలు చేస్తాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగులు శుభవార్తను వింటారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఖర్చులను అదుపు చేయండి. వృథా ప్రయాణాలు వద్దు.
మకరం
అన్నింటా అనుకూల ఫలితాలొస్తాయి. ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. అవసరమైన గృహోపకరణాలను కొంటారు. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. అధికారుల అభిమానాన్ని చూరగొంటారు. అరుదైన అవకాశం అందివస్తుంది సద్వినియోగం చేసుకోండి. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. శుభ కార్యాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు.
కుంభం
అత్యంత యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. వైరివర్గంపై విజయం సాధిస్తారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. అధికారుల అభిమానాన్ని పొందుతారు. ఉద్యోగులకు రివార్డులు దక్కుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మేలైన అవకాశాలు అందివస్తాయి. గృహోపకరణాలను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. అవసరమైనప్పుడు మిత్రుల సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మీనం
ప్రారంభంలో కొన్ని చికాకులు వచ్చినా వారాంతానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశించిన ఫలితాలు పొందేందుకు బాగా శ్రమించాలి. ఆటంకాలను అధిగమిస్తేనే అభీష్టం నెరవేరుతుంది. బంధువులను కలుస్తారు. నూతన అవకాశాలు కలిసివస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. గౌరవం వృద్ధి చెందుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. చెప్పుడు మాటలు నమ్మితే తగాదాలు తలెత్తుతాయి. భవిష్యత్ కోసం చక్కటి ప్రణాళికలు రూపొందిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటి పరిస్థితులు తృప్తినిస్తాయి.