రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే..ఈ సమస్యలు తప్పవు

రాత్రి భోజనం
మనలో చాలా మంది అర్ధరాత్రి భోజనం చేస్తుంటారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుస్తే మీరు షాక్ అవుతారు. అవేంటో చూద్దాం.
అజీర్ణం
రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో అజీర్ణం, ఉబ్బరం, వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి
నిద్రకు ఆటంకం
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తే నిద్రకు భంగం కలుగుతుంది. విశ్రాంతి సమయం తక్కువగా ఉంటుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
యాసిడ్స్ రిఫ్లక్స్
రాత్రిపూట ఆలస్యంగా తింటే యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. గుండెల్లో మంట, చికాకను కలిగిస్తుంది.
బరువు పెరుగుతారు
ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రిస్తే బరువు పెరుగుతారు.
డయాబెటిస్
రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే గ్లూకోజ్ జీవక్రియ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.
గుండె సమస్యలు
రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేస్తే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి రక్తపోటుపై ప్రభావం చూపుతాయి. దీంతో గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది.