EMI మిస్ అయితే ఏం జరుగుతుంది?

గడువు తేదీలోపు EMI చెల్లించకపోతే ఆ మొత్తం ఓవర్‌డ్యూగా మారుతుంది. బ్యాంకు SMS, ఇ-మెయిల్ లేదా కాల్ ద్వారా చెల్లింపు గురించి గుర్తు చేయొచ్చు.
వెంటనే NPA అవుతుందా.?
ఒక్క EMI చెల్లించకపోయినంత మాత్రాన రుణ ఖాతా NPA (నాన్ ప‌ర్ఫామింగ్ అసెట్‌)గా మారదు. అయితే ఆలస్య చెల్లింపుపై ఒప్పందం ప్రకారం కొన్ని ఛార్జీలు పడొచ్చు.
90 రోజుల నిబంధన
అసలు లేదా వడ్డీ మొత్తం 90 రోజులకు మించి బకాయి ఉంటే NPAగా మారే అవకాశం ఉంటుంది. అందుకే 90 రోజులలోపు బకాయిని క్లియర్ చేయడం చాలా ముఖ్యం.
మూడు EMIలపై అపోహ
మూడు EMIలు మిస్ అయితేనే NPA అవుతుందని చెప్పడం పూర్తిగా సరైనది కాదు. ఖాతాలో బకాయి 90 రోజులకు మించి కొనసాగిందా అనేదే కీలకం.
ఆలస్య చెల్లింపుపై ఛార్జీలు
EMI ఆలస్యమైతే రుణ ఒప్పందం ప్రకారం వడ్డీ లేదా ఇతర ఛార్జీలు వర్తించొచ్చు. ఎంత మొత్తం చెల్లించాలనేది రుణ సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
ఆలస్య చెల్లింపుపై ఛార్జీలు
EMI ఆలస్యమైతే రుణ ఒప్పందం ప్రకారం వడ్డీ లేదా ఇతర ఛార్జీలు వర్తించొచ్చు. ఎంత మొత్తం చెల్లించాలనేది రుణ సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం
EMIలు తరచుగా ఆలస్యం చేస్తే క్రెడిట్ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. దీంతో భవిష్యత్తులో లోన్ లేదా క్రెడిట్ కార్డు పొందడం కష్టమవొచ్చు.
బ్యాంకును వెంటనే సంప్రదించాలి
ఆర్థిక ఇబ్బందులతో EMI చెల్లించలేకపోతే బ్యాంకుకు ముందుగానే సమాచారం ఇవ్వండి. మీ పరిస్థితికి అందుబాటులో ఉన్న పరిష్కారాలను రుణ సంస్థను అడిగి తెలుసుకోండి.
EMI తేదీ మార్చే అవకాశం
జీతం వచ్చే తేదీ, EMI తేదీ మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటే బ్యాంకును సంప్రదించొచ్చు. రుణ సంస్థ విధానాన్ని బట్టి EMI తేదీ మార్పును అనుమతించే అవకాశం ఉంటుంది.
రీషెడ్యూలింగ్‌ కూడా ఉండొచ్చు
కొన్ని పరిస్థితుల్లో రుణ సంస్థ రీపేమెంట్ షెడ్యూల్‌లో మార్పులు సూచించవచ్చు. ఇది లోన్‌ రకం, కస్టమర్ పరిస్థితి, సంస్థ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.
NPA అయితే రికవరీ చర్యలు
రుణ ఖాతా NPAగా మారితే బకాయిల వసూలుకు తదుపరి చర్యలు మొదలవొచ్చు. సెక్యూర్డ్ లోన్ అయితే వర్తించే చట్టాల ప్రకారం తాకట్టు ఆస్తిపై చర్యలు ఉండొచ్చు.