స్వీట్లు ఈ సమయంలో తినాలట

స్వీట్లు తినడానికి సమయం
చాలా మందికి స్వీట్లు అంటే ఇష్టం ఉంటుంది. అయితే స్వీట్లు తినడానికి సరైన సమయం ఉందని మీకు తెలుసా?
ఊబకాయం
చాలా మంది తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా స్వీట్లు తింటారు. ఫలితంగా ఊబకాయం, ఇతర సమస్యలతో బాధపడుతుంటారు. మరి స్వీట్లు ఎప్పుడు తినాలి?
ఆయుర్వేదం
ఆయుర్వేదం ప్రకారం ఉదయం బ్రేక్ ఫాస్టు సమయంలో మధ్యాహ్నం భోజనానికి ముందు స్వీట్లు తినాలి.
జీర్ణానికి ఎక్కువ సమయం
స్వీట్లు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. భోజనం తర్వాత స్వీట్లు తింటారు. ఫలితంగా కేలరీలు పెరిగి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.
భోజనానికి ముందు
మధ్యాహ్న భోజనానికి ముందు స్వీట్లు తింటే తక్కువ ఆహారం తింటారు.ఫలితంగా తక్కువ కేలరీలు తీసుకుంటారు.
బరువు
మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఉదయం బ్రేక్ ఫాస్టులో మాత్రమే స్వీట్లు తినాలి. ఇలా అయితే త్వరగా జీర్ణం అవుతాయి.
రాత్రిపూట
రాత్రిపూట స్వీట్లు ఎప్పుడూ తినకూడదు. రాత్రిపూట స్వీట్లు తింటే ఊబకాయం వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.