వాట్సాప్ బిజినెస్ యూజర్లకు షాక్.. ఇకపై మెసేజ్‌లకు డబ్బులు కట్టాల్సిందే!
సాధారణ వినియోగదారులపై ప్రభావం లేదు:
ఈ కొత్త నిబంధనలు కేవలం వ్యాపార ఖాతాలకు మాత్రమే వర్తిస్తాయి, సాధారణ వాట్సాప్ యూజర్లు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
సర్వీస్ మెసేజ్‌లపై ఛార్జీలు:
అక్టోబర్ 1 నుంచి వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌లో కస్టమర్ల ప్రశ్నలకు ఇచ్చే నాన్ టెంప్లేట్ సర్వీస్ రిప్లైలకు మెటా రుసుము వసూలు చేయడం ప్రారంభించింది.
ప్రతి నెలా 1,000 మెసేజ్‌లు ఫ్రీ:
ప్రతి బిజినెస్ ఫోన్ నంబర్‌కు నెలకు మొదటి 1,000 సర్వీస్ మెసేజ్‌‌లు ఉచితంగా లభిస్తాయి, ఆ తర్వాత పంపే ప్రతీ సందేశానికి ఛార్జ్ పడుతుంది.
భారతదేశంలో ధర ఎంతంటే:
భారత్‌లో సర్వీస్ మెసేజ్ రేటు జీఎస్టీ మినహాయించి ప్రతి మెసేజ్‌కు రూ. 0.115 (సుమారు 11.5 పైసలు)గా నిర్ణయించబడింది.
ఏఐ ఏజెంట్ మెసేజ్‌ల బిల్లింగ్:
మెటా బిజినెస్ ఏజెంట్ ప్లాట్‌ఫారమ్ ద్వారా జనరేట్ అయ్యే ఏఐ రిప్లైలకు టోకెన్ వినియోగం ఆధారంగా ప్రత్యేకంగా బిల్లింగ్ జరుగుతుంది.
పేమెంట్ పద్ధతి తప్పనిసరి:
వ్యాపార ఖాతాలు తమ అకౌంట్‌లో సరైన పేమెంట్ మెథడ్‌ను లింక్ చేయకపోతే మెసేజ్‌ల డెలివరీ నిలిచిపోయే అవకాశం ఉంది.
యూటిలిటీ మెసేజ్‌ల నిబంధనలు:
24 గంటల కస్టమర్ సర్వీస్ విండోలోపల పంపే కొన్ని యూటిలిటీ మెసేజ్‌లకు కూడా కొత్త నిబంధనల ప్రకారం ఛార్జీలు వర్తిస్తాయి.
వ్యాపార ఖర్చులపై ప్రభావం:
ఎక్కువగా కస్టమర్లతో చాట్ చేసే సంస్థలకు ఈ కొత్త నిబంధనల వల్ల నెలవారీ కమ్యూనికేషన్ ఖర్చులు కొంతవరకు పెరిగే అవకాశం ఉంది.
కంపెనీల ముందస్తు ఏర్పాట్లు:
సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు బిజినెస్ అకౌంట్లు అన్నీ తమ పేమెంట్ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.