వాట్సాప్‌లో సరికొత్త ఏఐ ఫీచర్:

కస్టమర్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు వాట్సాప్ థర్డ్-పార్టీ ఏఐ ఏజెంట్లు, బాట్లతో చాట్ చేసే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది.
వేరే యాప్స్ అవసరం లేదు:
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాట్ చేయడానికి గూగుల్ జెమిని, చాట్‌జిపిటి లాంటి ఇతర ఏఐ యాప్‌లు లేదా వెబ్‌సైట్లకు వెళ్లాల్సిన పని ఉండదు.
సెట్టింగ్స్‌లో 'ఏజెంట్స్' సెక్షన్:
వాట్సాప్ సెట్టింగ్స్ విభాగంలో కొత్తగా 'Agents' అనే సెక్షన్ లభించనున్నట్లు డెవలపర్లు గుర్తించారు.
ఐదు ఏఐ ఏజెంట్లకు అవకాశం:
యూజర్లు తమ వేర్వేరు అవసరాల కోసం ఒకే వాట్సాప్ ఖాతాకు గరిష్టంగా ఐదు ఏఐ ఏజెంట్లను అనుసంధానించుకోవచ్చు.
ప్రొఫైల్ నేమ్, ఫోటో సెట్టింగ్స్:
కనెక్ట్ చేసిన ప్రతి ఏఐ ఏజెంట్‌ను సులువుగా గుర్తించడానికి వాటికి వేర్వేరు పేర్లు, ప్రొఫైల్ ఫోటోలు సెట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
ఏపీఐ కీ టెక్నాలజీ :
ఏఐ సర్వీస్‌ను వాట్సాప్‌తో అనుసంధానించడానికి సెట్టింగ్స్ ద్వారా జనరేట్ అయ్యే ఏపీఐ కీ కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రతి ఏఐకీ ప్రత్యేక చాట్ విండో:
కనెక్ట్ చేసిన ప్రతి ఏఐ ఏజెంట్‌కు సాధారణ వాట్సాప్ చాట్ లాగే ప్రత్యేకమైన మెసేజింగ్ విండో కేటాయించబడుతుంది.
డేటా ప్రైవసీకి పూర్తి రక్షణ:
ఈ థర్డ్-పార్టీ ఏఐ ఏజెంట్లకు మీ వ్యక్తిగత వాట్సాప్ చాట్లు, కాంటాక్ట్లు లేదా మీడియా ఫైళ్లను చూసే అవకాశం ఉండదు.
ఎప్పుడైనా తొలగించవచ్చు:
ఏజెంట్‌ను వద్దనుకుంటే సెట్టింగ్స్ నుంచి సులభంగా డిలీట్ చేయవచ్చు. అయితే పాత చాట్ హిస్టరీ మాత్రం యాప్‌లోనే భద్రంగా ఉంటుంది.
త్వరలోనే అందరికీ లభ్యం:
ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్, రాబోయే కొన్ని నెలల్లో సాధారణ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.