వాట్సాప్ కొత్త ఫీచర్:

వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది చాట్ బ్యాకప్ విధానాన్ని మార్చనుంది.
గూగుల్ డ్రైవ్‌కు ప్రత్యామ్నాయం:
ఇప్పటివరకు ఆండ్రాయిడ్ యూజర్లు చాట్ బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్‌పైనే ఆధారపడేవారు. ఇకపై ఆ అవసరం లేదు.
వాట్సాప్ సొంత సర్వర్లు:
యూజర్లు తమ చాట్ బ్యాకప్‌ను నేరుగా వాట్సాప్ సర్వర్లలోనే భద్రపరచుకోవచ్చు.
2GB ఉచిత స్టోరేజ్:
ఈ ఫీచర్ కింద వాట్సాప్ 2GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది.
కొత్త వెర్షన్:
Android 2.26.46.4 వెర్షన్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ అప్‌డేట్‌తో కొత్త క్లౌడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
గూగుల్ స్టోరేజ్‌పై భారం తగ్గింపు:
గూగుల్ ఖాతాలో 15GB ఉచిత స్టోరేజ్ డ్రైవ్, జీమెయిల్, ఫోటోలు కలిపి వాడుకోవాలి. వాట్సాప్ బ్యాకప్‌లు దానిని త్వరగా నింపేస్తాయి. కొత్త ఫీచర్‌తో ఈ సమస్య తగ్గుతుంది.
ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్:
బ్యాకప్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయి. ఇది డిఫాల్ట్‌గా ఉంటుందని వాట్సాప్ తెలిపింది.
ఎవరూ చూడలేరు:
బ్యాకప్ డేటాను వాట్సాప్, మెటా సహా ఎవరూ యాక్సెస్ చేయలేరని సంస్థ స్పష్టం చేసింది.
మీ ఎంపిక మీదే:
యూజర్లు గూగుల్ డ్రైవ్ లేదా వాట్సాప్ క్లౌడ్ స్టోరేజ్ మధ్య తమకు నచ్చిన బ్యాకప్ ప్రొవైడర్‌ను ఎంచుకోవచ్చు.
భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు:
ఎక్కువ స్టోరేజ్ కోసం చెల్లింపు ప్లాన్లు రావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ యూజర్ల కోసం కూడా ఇలాంటి సదుపాయం సిద్ధమవుతోంది.