వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ఆ చాట్స్ మరింత సేఫ్.!
కొత్త ప్రైవసీ ఫీచర్ పరిచయం
వాట్సాప్ యూజర్ల గోప్యతను మరింత పెంచే ఉద్దేశంతో 'రెస్ట్రిక్టెడ్ చాట్' అనే సరికొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది.
లాక్ చేసిన చాట్స్‌కు మించి భద్రత
ఇప్పటికే ఉన్న చాట్ లాక్ ఫీచర్‌కంటే ఇది మరింత పటిష్టంగా ఉండి, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
నోటిఫికేషన్లు పూర్తిగా మాయం:
ఈ రెస్ట్రిక్టెడ్ జాబితాలో ఉండే కాంటాక్ట్ల నుంచి వచ్చే మెసేజ్‌లకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్లు లేదా అలర్ట్‌లు స్క్రీన్‌పై కనిపించవు.
రహస్య కోడ్ లేదా బయోమెట్రిక్ లాక్
ఈ ప్రత్యేక చాట్లను ఓపెన్ చేయాలంటే కేవలం మీ ఫేస్‌‌లాక్, ఫింగర్‌ప్రింట్ లేదా సీక్రెట్ పాస్‌కోడ్ ఉంటేనే సాధ్యమవుతుంది.
అనుకోని వ్యక్తుల నుంచి రక్షణ:
మన ఫోన్ వేరే వాళ్ళ చేతికి వెళ్లినప్పుడు కూడా ఈ రెస్ట్రిక్టెడ్ చాట్లు ఎవరి కంట పడకుండా పూర్తిగా సురక్షితంగా ఉంటాయి.
చాట్ వివరాలు గోప్యంగా ఉంచడం
ఎవరితో చాట్ చేస్తున్నామనే సమాచారం కూడా మెయిన్ చాట్ లిస్ట్‌లో కనిపించకుండా ప్రత్యేక ఫోల్డర్‌లోకి వెళ్తుంది.
త్వరలోనే అన్ని ఫోన్లకు అప్‌డేట్
ప్రస్తుతం బీటా వెర్షన్‌లో పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూందర్లందరికీ అందుబాటులోకి రానుంది.
సేఫ్ అండ్ సెక్యూర్
ఇలాంటి తరహ ఫీచర్లతో వినియోగదారుల గోప్యత భద్రంగా ఉంటుందని సంస్థ పేర్కొంది.
యూజర్ల నుంచి సానుకూల స్పందన
వ్యక్తిగత గోప్యతకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే వాట్సాప్ తీసుకువస్తున్న ఈ ఫీచర్ పట్ల టెక్ నిపుణులు, యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.